టీడీపీ తమ్ముళ్లతో వైసీపీ క్యాడర్‌‌ దోస్తానా?

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తుంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. అధికార, ప్రతిపక్షం అంటే ఏందో చూపిస్తూ ఉంటారు. వారి మధ్య విభేదాలు.. వారి మధ్య రాజకీయ వైరుధ్యంతో ఇలా జరుగుతుంటుంది. ఏ రాష్ట్రంలో అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ.. అదేంటో ఏపీలో ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తోందంట. ఇరుపక్షాల మధ్య సయోధ్య వస్తోందట. దీనికంతటికి వైసీపీ నేతల్లో అసంతృప్తే కారణమట. […]

Written By: NARESH, Updated On : November 3, 2020 10:36 am
Follow us on

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తుంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. అధికార, ప్రతిపక్షం అంటే ఏందో చూపిస్తూ ఉంటారు. వారి మధ్య విభేదాలు.. వారి మధ్య రాజకీయ వైరుధ్యంతో ఇలా జరుగుతుంటుంది. ఏ రాష్ట్రంలో అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ.. అదేంటో ఏపీలో ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తోందంట. ఇరుపక్షాల మధ్య సయోధ్య వస్తోందట. దీనికంతటికి వైసీపీ నేతల్లో అసంతృప్తే కారణమట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పదేళ్ల తరువాత కష్టపడి అధికారంలోకి వచ్చినా పార్టీలో తగిన గౌరవ మర్యాదలు దక్కడంలేదని వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారట. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ పైనా ఏకంగా వైసీపీ నేతలు, క్యాడరే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకువచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలను జనాలు అసలు పట్టించుకోవడంలేదు. వారు నేరుగా సచివాలయానికి వెళ్లి తమ పని చేసుకుంటూ పోతున్నారు. అర్హత ఉంటే చాలు రేషన్ కార్డు, ఇంటి స్థలం, ఇతర సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేయమని జగన్ పెద్ద ఆర్డర్ వేశారు. దాంతో వాలంటీర్లు కూడా కేవలం అర్హతలు చూస్తున్నారు. వాటి ఆధారంగా అర్హులకు పథకాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో ఉన్న వైసీపీ క్యాడర్‌‌కు పెద్దగా ప్రాధాన్యం దొరకడం లేదని ఫీలవుతున్నారు. తాము చెబితేనే మంజూరైందని చెప్పుకోడానికి వీలు లేకుండా పోతోందే అంటూ బాధపడుతున్నారంట.

Also Read:జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్‌

గ్రామాల్లో ఒకప్పుడు టీడీపీ జన్మభూమి కమిటీలను నియమించింది. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టేవారు. అలాగే వైసీపీ అభిమానులు అని కూడా వివక్ష చూపేవారు. ఈ పరిణామాలను చూసిన వైసీపీ క్యాడర్ తాము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోవాలని కలలు కన్నారు. తాము పవర్‌‌లోకి వస్తే టీడీపీ తమ్ముళ్లకు చుక్కలు చూపించాలని కూడా భావించారు. కానీ.. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వారిది.

Also Read: నెల్లూరులో పది మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్సింగ్.. చివరకు..?

మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఫైర్‌‌ అవుతున్నారు. సరిగ్గా పనులు కావడంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా తమ వారి కోసం పనులు చేయించుకోవాలని చూస్తే అనర్హత పేరిట పక్కన పెడుతున్నారన్నది వారి బాధ. అందుకే.. ఇప్పుడు గ్రామ స్థాయిల్లో వైసీపీ, టీడీపీ నేతలు దోస్తానా కడుతున్నట్లు తెలుస్తోంది.