
TRS Dharna: ఉద్యమ పార్టీగా ఉన్న కాలంలో గులాబీ పార్టీ ఇందిరా పార్కును వేదికగా చేసుకుని ఉద్యమాలు చేసింది. తరువాత అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ లు వద్దని అన్నింటిని మూసేసింది. కానీ ప్రస్తుతం వాటి అవసరమే సర్కారుకు ఏర్పడింది. ఇన్నాళ్లు ధర్నాలు వద్దని సూచించినా ఇప్పుడు వాటి అవసరం సర్కారుకు ఏర్పడింది. బీజేపీపై చేసే పోరులో భాగంగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసేందుకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
వరిపై పోరులో భాగంగానే బీజేపీపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ర్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతులు తీసుకునేందుకు తయారయింది. కేంద్రంపై జరిగే ఉద్యమంలో అందరు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులకు ఇబ్బందుల కలుగుతున్నాయని తెలిపేందుకే నిర్ణయించుకుంది.
శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతులతో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసేందుకు సంకల్పించింది. సాగునీరు, రైతుబంధు, 24 గంటల కరెంటు వంటి పథకాలతో రైతులకు దగ్గరయినా కేంద్ర ప్రభుత్వం కావాలనే రాద్దాంతం చేస్తోందని ఆరోపిస్తూ గులాబీ పార్టీ ఉద్యమం చేయనుంది. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసేందుకు సిద్ధమైంది.
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలతో దేశమే నష్టపోతోందని వాపోతున్నారు. పంటల్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అయినా రాష్ర్ట ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలపై టీఆర్ఎస్ తన ఆవేశం వెల్లగక్కనుంది. ఈ నేపథ్యంలో కేంద్రమే అన్నింటికి బాధ్యత వహించాలని చెబుతోంది. దీని కోసమే ధర్నాలు చేసేందుకు రెడీ అవుతోంది.
Also Read: హరీశ్ రావుకు ఆరోగ్య శాఖ కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటో?