Munugodu By-Poll:  మునుగోడులో టామ్ (టీఆర్ఎస్) అండ్ జెర్రీ(బీజేపీ) ఫైట్.. రౌండ్ రౌండ్ కు చేతులు మారుతున్న ఆధిక్యం

Munugodu By-Poll: కార్టూన్ నెట్వర్క్ లో టామ్ అండ్ జెర్రీ సిరీస్ పిల్లలకు ఎంత ఇష్టం. ఒకసారి ఒకరిది పై చేయి అయితే. మరొకసారి ఇంకొకరిది పై చేయి అవుతుంది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే జరుగుతున్నది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పోటాపోటీగా ఉన్న ఇరు పార్టీలు… ఇప్పటివరకు లెక్కించిన రౌండ్లలోనూ అదే తీరును ప్రదర్శించాయి. ఇక రౌండ్ల వారిగా చూస్తే తొలి రౌండులో టిఆర్ఎస్కు 6,418 ఓట్లు లభించాయి. బిజెపికి 5,126 ఓట్లు లభించాయి.. […]

Written By: K.R, Updated On : November 6, 2022 12:03 pm
Follow us on

Munugodu By-Poll: కార్టూన్ నెట్వర్క్ లో టామ్ అండ్ జెర్రీ సిరీస్ పిల్లలకు ఎంత ఇష్టం. ఒకసారి ఒకరిది పై చేయి అయితే. మరొకసారి ఇంకొకరిది పై చేయి అవుతుంది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే జరుగుతున్నది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పోటాపోటీగా ఉన్న ఇరు పార్టీలు… ఇప్పటివరకు లెక్కించిన రౌండ్లలోనూ అదే తీరును ప్రదర్శించాయి.

ఇక రౌండ్ల వారిగా చూస్తే తొలి రౌండులో టిఆర్ఎస్కు 6,418 ఓట్లు లభించాయి. బిజెపికి 5,126 ఓట్లు లభించాయి.. కాంగ్రెస్ 2,100 ఓట్లతో సరిపెట్టుకుంది..

ఇక రెండవ రౌండ్లో టిఆర్ఎస్ 7,781 ఓట్లు సాధించింది.. బిజెపి 8,622 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 1,531 ఓట్లు మాత్రమే సాధించింది.

మూడో రౌండ్లో టిఆర్ఎస్ 7,010 ఓట్లు సాధించింది. బిజెపి 7,426 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 1,532 ఓట్లతోనే సరిపెట్టుకుంది.

నాలుగో రౌండ్లో 4,854 ఓట్లు టిఆర్ఎస్ కు వచ్చాయి.. బిజెపికి 4,555 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 1,817 ఓట్లు సాధించింది.

మొదటినుంచి చౌటుప్పల్ లో భారీగా ఓట్లు వస్తాయని బిజెపి భావించింది. అయితే ఇక్కడ బిజెపికి ఆధిక్యం తగ్గింది. ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం లింగ వారి గూడెంలో బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక శ్రీనివాస్ గౌడ్ ఇన్చార్జిగా ఉన్న లింగోజిగూడెం, మల్లారెడ్డి ఇన్చార్జిగా ఉన్న గ్రామాల్లో బిజెపికి మెజారిటీ ఓట్లు వచ్చాయి. ఇక చౌటుప్పల్ మండలంలో 55, 678 ఓట్లు పోలయ్యాయి.. ఇక్కడ టిఆర్ఎస్ కు 21 , 209 ఓట్లు వచ్చాయి. బిజెపికి 21,174 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 5,169 ఓట్లు వచ్చాయి. అయితే చౌటుప్పల్ లో ఆదిక్యం తగ్గడంతో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాశ చెందారు. ఫలితం ఎలాగైనా ఉంటుందని, చివరి వరకు హోరాహోరి తప్పదని ఆయన వెల్లడించారు.

ఇక రౌండ్ రౌండ్ కు బలబలాలు మారుతున్న నేపథ్యంలో ఉత్కంఠ పెరుగుతోంది. ఐదవ రౌండ్ లెక్కింపు ముగిసిన అనంతరం టిఆర్ఎస్ 1,631 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది. ఎన్నికల లెక్కింపునకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల సంఘం అధికారులపై మండిపడ్డారు. లెక్కింపులో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.