
Bandi Sanjay: బీకాంలో ఫిజిక్స్… ఈ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఆంధ్రా మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెప్పిన డైలాగ్ ఇది. తెలంగాణలో కేసీఆర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ఇలాంటి డైలాగ్‌లే చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. తాజాగా ఇలాగే అడ్డంగా బుక్కయ్యారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఓ యూట్యూబ్ చానెల్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి చేసే ఉద్యోగం గురించి చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
రిటైర్డ్ టీచర్.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం..
ఇదేంటీ రిటైర్డ్ టీచర్.. ఇరిరేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం అని రాశారు.. ఎవరు అతను.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కరికే వచ్చాయా.. రెండు ఎలా చేస్తున్నాడు. రిటైర్ అయ్యాగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇచ్చారా.. ఇలా అనేక సందేహాలు వస్తున్నాయ్ కదా.. రావాల్సిందే. అలా డౌట్ రాకుంటే.. మనం సరిగా చదవనట్లే. ఇదిలా ఉంచితే ఈ డైలాగ్ ఎవరు చెప్పారంటే.. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఓ యూట్యూబ్ చానెల్‌కు తాను ఎంపీ అయిన మొదట్లోనో.. లేక తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెబుతూ మొదట రిటైర్డ్ టీచర్ అన్నారు. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాడని చెప్పారు.
అదెలా అంటే..
సంజయ్ సమాధానంతో షాక్ అయిన యాంకర్ రిటైర్డ్ టీచర్ అన్నారు.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అంటున్నారు… అదెలా అండి అని ప్రశ్నించగానే తడుముకున్న సంజయ్ ఆ రెండు సమాధానాలను కవర్ చేసేలా మరో సమాధానం చెప్పారు. అదేంటంటే.. ‘ప్రభుత్వం ఉద్యోగం అండీ’ అనీ. దీంతో షాక్ అవడం యాంకర్ వంతు అయింది. ఏమనాలో అర్థంకాని యాంకర్.. ఆ టాపిక్ వదిలేసి మరో అంశంపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు.

ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పరువు తీశాడు అని కొందరు.. లాఫింగ్ ఈమోజీతో కొందరు.. బండిగారూ.. మస్త్ చెప్పారు అని ఇంకొందరు.. ఏరా బండి నీ సబ్బు సోనా ఏంటి అంటూ వివిధ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన వారు ప్రధాన మంత్రి అజ్ఞానుల గురించి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని జోడించి బండి వ్యాఖ్యలను మరింత రక్తికట్టించారు.