Troll Of The Day: అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు దానిని చంద్రబాబు నిజం చేసి చూపిస్తున్నారు. అధికారం లేకపోవడం, జగన్ ఎక్కడి కక్కడ ఒత్తుతుండటం తో “40 ఏళ్ల ఇండస్ట్రీ” బాబు కు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అన్నట్టు ఇక్కడ జగన్ పాలన గొప్పగా ఉందని కాదు. మొన్న నెల్లూరు, గుంటూరు సభల్లో కార్యకర్తలు చనిపోయారు. వారిని వెంటనే పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లిపోయారు. కానీ ఇక్కడే సజ్జల టీం అలర్ట్ అయింది. చంద్రబాబు రాకముందు అక్కడి పరిస్థితిని, వచ్చాక పరిస్థితిని రికార్డు చేసింది. మరుసటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియోలను చూపించుకుంటూ చంద్రబాబును చాకిరేవు పెట్టాడు. బాబుకు ఉన్న ప్రచార పిచ్చిని వీడియోలు, ఫోటోల ద్వారా చూపించాడు. పచ్చ మీడియాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా బాబోరిని గొప్పగా చూపించాలని ప్రయత్నంలో జగన్ మీడియా పై చిందులు తొక్కింది. మార్ఫ్ డ్ వీడియోలు, ఫొటోలు అంటూ కొట్టి పారేసింది. నిజాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే అంతకు మించి మాత్రం ఏమి అనగలదు.

ఎందుకంత ప్రచార పిచ్చి
వాస్తవానికి చంద్రబాబు అంటేనే ప్రచార పిచ్చికి పరాకాష్ట.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఆ రెండు పత్రికలు విపరీతమైన కవరేజ్ ఇచ్చేవి. ఇప్పుడు కూడా ఇస్తున్నాయి. మొన్న ఖమ్మంలో సభ పెట్టినప్పుడు చంద్రబాబు సొంత డప్పు కొట్టుకున్నాడు. ఆ రెండు పత్రికలు శరభ శరభ అంటూ రాసుకోచ్చాయి. మొన్న నెల్లూరులో సభ పెట్టినప్పుడు కూడా ఇదే స్థాయిలో డప్పు కొట్టాయి. గుంటూరులోనూ అదే తంతు కొనసాగింది.. కానీ దురదృష్టవశాత్తు ఆ సమావేశాలకు వచ్చినవారు చనిపోతే అదేదో వారి ఖర్మ అన్నట్టు ఆ రెండు పేపర్లు రాసుకొచ్చాయి. అంటే బాబుకు మంగళ హారతులు పట్టడం లో ఉన్న శ్రద్ధ… చనిపోయిన కార్యకర్తల మీద లేకపోవడం ఆ పచ్చ జర్నలిజానికి పరాకాష్ట..పైగా తప్పంతా నిర్వాహకులదే అన్నట్టుగా ఆ రెండు పత్రికలు రాయడం దరిద్రానికే దరిద్రం. ఇలా చేయబట్టే కదా జనాలు కాండ్రించి ముఖం మీద ఉమ్మింది. 23 స్థానాలకు పరిమితం చేసింది. అయినప్పటికీ ఆ బాబు మారడు. ఆ రెండు పత్రికలూ మారవు.
బజార్లో నిలబెడుతున్నారు
ఇక చంద్రబాబుకు సంబంధించి ఈమధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు.. గతంలో కొడాలి నాని, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి ఈ పని చేసేవారు. కానీ ఎందుకనో జగన్ ఈమధ్య సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యత అప్పగించారు. ఎలాగైనా జగన్ మెప్పు పొందాలని ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బలమైన టీం ను ఏర్పరచుకున్నాడు.. వారు కూడా ఆయనకు ట్యూన్ కావడంతో బెటర్ రిజల్ట్ వస్తోంది.. గుంటూరు, నెల్లూరు ఘటనల తర్వాత పచ్చ మీడియాకు పకడ్బందీగా కౌంటర్ ఎవరైనా ఇచ్చారంటే అది కేవలం సజ్జన రామ కృష్ణా రెడ్డి మాత్రమే.ఈ పనిని అటు సాక్షిగాని, ఇటు ఇతర మీడియా సంస్థలు గాని చేయకపోవడం జగన్ బ్యాడ్ లక్. అఫ్ కోర్స్ సాక్షి ఎప్పుడూ కూడా జగన్ కు ఉపయోగ పడింది లేదు.

పరువు పోయింది
సజ్జల రామకృష్ణా రెడ్డి చాకి రేవుతో చంద్రబాబు పరువు మొత్తం పోయింది. వీడియోలు, ఫోటోలను సాక్ష్యాలుగా చూపించి చాకిరేవు వేయడంతో బాబు ప్రచార పిచ్చి మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన దీక్షలను, మాట్లాడిన మాటలను సో కాల్డ్ గా సజ్జల అభివర్ణించారు.. గతంలో 23 కు పరిమితం చేశామని… ఈసారి అవి కూడా ఇవ్వబోమని సజ్జల చెప్పడం గమనార్హం. కానీ ఏ మాటకు ఆ మాట సజ్జల ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ నాయకులు పెద్దగా కౌంటర్ ఇవ్వలేదు. అంటే మాడు వాసన బాగానే వస్తున్నట్టు లెక్క.