https://oktelugu.com/

Youth on AP Roads: ప్రభుత్వం మీద నమ్మకం లేదు.. సొంతంగా రోడ్డు వేసుకున్న గిరిజనులు

ఏపీ ప్రభుత్వం కనీసం రోడ్లు వేసే పరిస్థితిలో లేకపోవడంతో గిరిజనులే ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం తీరును తిట్టుకుంటూ గిరిజనులు ఏకంగా రోడ్డుకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి మండలంలో బొడ్డపుట్టు గిరిజనులు సొంతంగా రోడ్డు నిర్మాణం చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2023 10:32 pm
    Follow us on

    AP Roads : సంక్షేమం మాటున అన్నీ పంచేస్తున్నారు మన జగనన్న.. నేరుగా డబ్బులు వచ్చి అకౌంట్లో పడిపోతున్నాయి. అయితే ఈ పైసల కోసం అభివృద్ధిని ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నవరత్నాలు, జగన్ పథకాలకే డబ్బులన్నీ అయిపోయే.. ఇక అభివృద్ధి చేయడానికి కానాలు లేకపోయే అన్నట్టుగా ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఉంది.

    రోడ్లు, మౌళిక సదుపాయాలు ఇతర వాటికి వెచ్చించడానికి ప్రభుత్వం వద్ద పైసలు లేకపోవడంతో అభివృద్ధి పడకేస్తోంది. సంక్షేమం గొప్పగా.. అభివృద్ధి చప్పగా సాగుతోంది. ఏపీలో ఏ గ్రామానికి సరైన రోడ్లు సదుపాయాలు లేకుండా పోతున్నాయి. గ్రామానికి సొంతంగా రోడ్డు వేసుకున్న గిరిజనుల దుస్థితి చూసి అందరూ అయ్యో అంటున్నారు.

    ఏపీ రోడ్లు దారుణమైన పరిస్థితి లో ఉన్నాయి. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్ లు , వైద్య సిబ్బంది రావడం లేదు. మా చావులు వర్ణనాతీతం అంటు ఏపీ ప్రభుత్వం పై గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే మాకు చవే శరణం అంటూ వాపోతున్నారు. ఎటువంటి అంబులెన్స్ అయిన మా మండలానికి రావడం లేదంటూ వాపోతున్నారు. అంబులెన్స్ కోసం రోడ్డు సౌకర్యాన్ని గిరిజనులే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు.

    ఏపీ ప్రభుత్వం కనీసం రోడ్లు వేసే పరిస్థితిలో లేకపోవడంతో గిరిజనులే ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం తీరును తిట్టుకుంటూ గిరిజనులు ఏకంగా రోడ్డుకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి మండలంలో బొడ్డపుట్టు గిరిజనులు సొంతంగా రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కలిసి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సొంతంగా మట్టిరోడ్డు నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు.