https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’పై కొనసాగుతున్న వివాదం.. రంగంలోకి ఆదివాసీలు..!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. నందమూరి.. మెగా హీరోలు ఒకే స్ర్కీన్ పై కన్పించబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. Also Read: మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసిన భారీ ప్లాప్ డైరెక్టర్ ! ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజై సెన్షషన్ క్రియేట్ చేశాయి. తాజాగా ‘రామరాజు ఫర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 12:03 pm
    Follow us on

    Tribal Serious on RRR Teaser

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. నందమూరి.. మెగా హీరోలు ఒకే స్ర్కీన్ పై కన్పించబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసిన భారీ ప్లాప్ డైరెక్టర్ !

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజై సెన్షషన్ క్రియేట్ చేశాయి. తాజాగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలై అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంది. కాగా ఈ టీజర్లో చివర్లో ఎన్టీఆర్(కొమురంభీమ్)ను ముస్లిం గెటప్ లో చూపించడం వివాదానికి కారణమైంది. కొమురంభీం చరిత్రను దర్శకుడు రాజమౌళి తప్పుగా చూపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

    ఈనేపథ్యంలో పలు ఆదివాసీ సంఘాలు ‘ఆర్ఆర్ఆర్’పై లొల్లి షూరు చేశారు. జల్ జమీన్ జంగిల్ పేరుతో ఆదివాసీ హక్కుల కోసం కొమురంభీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆదివాసులు గుర్తు చేసుకుంటున్నారు. కొమురంభీంను దర్శకుడు రాజమౌళి ముస్లిం గెటప్ లో చూపించాన్ని తప్పుబడుతూ హెచ్చరికలు జారీ చేశారు.

    దర్శకుడు రాజమౌళి కొమురంభీం చరిత్రను పూర్తిగా తెలుసుకొని సినిమా చేయాలని కొమురంభీం యువసేన సూచించింది. కొమురంభీంకు ముస్లిం టోపీ పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడం సరైందని కాదని దర్శకుడు రాజమౌళికి సూచించారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ.. కొమురంభీం అసలు కథేంటీ?

    ‘ఆర్ఆర్ఆర్’లోని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని కొమురంభీం యువసేన డిమాండ్ చేసింది. లేకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే దర్శకుడు మాత్రం ఇది ఫిక్షన్ సినిమా అని చెబుతున్నాడు. అయినప్పటికీ వివాదం చెలరేగుతుండటంతో దర్శకుడు రాజమౌళి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తిని రేపుతోంది.