అనుకోని ఉపద్రవం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట తీవ్రవిషాదం నెలకొంది. సీఎం జగన్ పెద్దమామ, ముఖ్యమంత్రి సతీమణీ అయిన వైఎస్ భారతి రెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం తుదిశ్వాస విడిచారు.
Also Read: జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?
గంగిరెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పులివెందులలోని ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకొని ఇటీవల సొంతూరు గొల్లలగూడురులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది.
గంగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే పులివెందుల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సీతమణి భారతిరెడ్డి గొల్లలగూడురు చేరుకొని గంగిరెడ్డి భౌతిక కాయానికి నివాళురల్పించారు. గ్రామ సమీపంలోని తోట వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం
సీఎం జగన్ కూడా తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. ఆయన కూడా తన పెద్దమామ గంగిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించేందుకు పులివెందుల వెళ్తారని తెలుస్తోంది.
Comments are closed.