శ్రీశైలంలో ఏంటీ పరిస్థితి?

ఎగువ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలోనే నది పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. కృష్ణా నది పరివాహకంలో ఉన్న జూరాల నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులు నిండి కిందకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆదివారం సందర్శకుల […]

Written By: NARESH, Updated On : September 21, 2020 8:06 am
Follow us on

ఎగువ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలోనే నది పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. కృష్ణా నది పరివాహకంలో ఉన్న జూరాల నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులు నిండి కిందకు నీరు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకు అధికసంఖ్యలో తరలివచ్చారు.

దీంతో ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పర్యాటకులు పిల్లలతో వచ్చి కొండలపై ఇరుక్కుపోయారు. నరకయాతన పడుతున్నారు. తిండి లేక.. నీళ్లు లేక చాలా మంది వెనక్కి రాలేక ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి.

రోడ్లు మొత్తం రద్దీగా మారి కనీసం రివర్స్ వచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు.. ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో పోలీసులు, యాత్రికుల మధ్య పలు చోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.