Tomato Sale: కూరగాయలు కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. కూరగాయల ధరలు వింటే గుండె గుబేలుమంటుందని ప్రజలు అంటున్నారు. ఆ స్థాయిలో కూరగాయల ధరలు పెరిగాయి. అందులోనూ.. టమాటా ధరలు మండిపోతున్నాయి. వంటింట్లో టమాటా లేకపోతే ఈ కూరకు రుచి రాదు. అలాంటి టమాట ధరలు గత నెల వరకు కిలోకు 30 నుంచి 40 రూపాయలు ఉండేవి. గత రెండు వారాల్లో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం టమాటా ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్ లోనే కిలోకు టమాటా ధర రూ.80 ఉండగా, రిటైల్ మార్కెట్ కు వచ్చేసరికి రూ.100 నుంచి రూ.120 పలుకుతుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. అయితే.. గత కొద్దిరోజుల్లోనే టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతలా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా టమాటా రాకపోవడమే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. గత కొద్ది రోజులుగా టమాటతో పాటు మిగతా కూరగాయల ధరలు పెరిగాయి. మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. అకాల వర్షాల కారణంగా సాగుచేసిన టమాటా పంట చేతికి రాకుండా పోయింది. దీంతోపాటు మార్కెట్‌లోకి రాక కూడా తగ్గింది. దీంతో టమాటా ధర కిలో రూ.100కి చేరింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం టమాటాలను కిలో రూ.65కు విక్రయించాలని నిర్ణయించింది. ఇది ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), నాఫెడ్, సఫాల్ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించబడుతుంది. అంతే కాకుండా మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా టమాటా విక్రయాలు జరగనున్నాయి.
వర్షం కారణంగా టమాటా పంటకు నష్టం
గత కొద్ది రోజులుగా టమాటతోపాటు పలు కూరగాయల ధరలు పెరిగాయి. మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. అక్టోబర్‌లో టమాటా ధరలు 39 శాతం పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. గత నెలలో కిలో సగటు ధర రూ.44 నుంచి రూ.62కి పెరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం హోల్ సేల్ మార్కెట్ లో టమాట ధర క్వింటాల్ కు రూ.3562 నుంచి రూ.5045కి పెరిగింది.
పెరిగిన వెజ్ థాలీ ధర
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం.. వెజ్ థాలీ ధరలు భారీగా పెరిగాయి. వెజ్ థాలీ ధరలు 11 శాతం పెరిగాయి. ఇందుకు కారణం కూరగాయల ధర. అయితే, నాన్ వెజ్ థాలీ రేట్లు 2 శాతం తగ్గాయి. ఇంతకు ముందు కూడా టమాటా ధరలు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే పద్ధతిలో విక్రయాలు ప్రారంభించింది. అప్పట్లో టమాట కిలో రూ.60కి విక్రయించేవారు.
రైతులు, వినియోగదారులకు డబుల్ దెబ్బ
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కూడా టమోటా పంటలు దెబ్బతిన్నాయని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. గతేడాది ఉత్పత్తి ఎక్కువైంది. అనేక ప్రాంతాల్లో టమాటా పంటలు కూడా వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో సరఫరా కూడా తగ్గిపోయింది. వర్షం కారణంగా రవాణా కూడా ఖరీదైనది. వర్షాకాలంలో కూరగాయల ధరలు పెరగడానికి ఇదే కారణం. ఈ ఏడాది మొదట్లో వేడిగాలులతో నష్టం వాటిల్లగా, భారీ వర్షాలు కురిసి రైతులు, వినియోగదారులకు రెట్టింపు నష్టం వాటిల్లింది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tomato sale governments key decision a kilo of tomato is rs 65
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com