Tollywood Actors: టాలీవుడ్ నుంచి ఇప్పుడొస్తున్నవి పేరుకు తెలుగు సినిమాలే అయినా అందులో సొంత భాష కనిపించడం లేదు. ఇందులో నటించేవాళ్లు సరైన తెలుగు మాట్లాడడం లేదు. వీరిని అనుకరించే చాలా మంది తెలుగును మరిచిపోతున్నారు. క్రమంగా తెలుగు భాష అంతరించిపోతుంది. తెలుగు పండితులు, మేధావులు తెలుగు భాషను కాపాడాలని తమదైన శైలిలో ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కంటితుడుపుగా తెలుగు మహాసభలు అని నిర్వహించి ఆ తరువాత తెలుగు భాషాభివృద్ధికి ప్రయత్నించడం లేదు. ఈ పరిస్థితిని చూసిన సుప్రీం కోర్టు సీజే.. సినిమాల్లో తెలుగుభాషను నిర్వీర్యం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా హీరోలు తెలుగు భాషను నేర్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ తెలుగు గాయకుడు ఘంటసాల శతజయంతి కార్యక్రమానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాల్లో నటించేవారు తెలుగు భాషను ఉపయోగిస్తే బాగుంటుంది. ముఖ్యంగా హీరోలు తెలుగు భాషలో మాట్లాడాలి. గాయకులు కూడా తెలుగు నేర్చుకొని పాడాలి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్లు తెలుగు రాకపోయినా.. డ్యాన్స్ రాకపోయినా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. తెలుగు రాకపోతే అవమానకరంగా భావించవద్దు. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇంట్లో తెలుగు నేర్పించాలి’ అని అన్నారు.
ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో సరైన తెలుగు కనిపించడం లేదు. ఇంగ్లీష్, హీందీ భాషలను కలిపి తెలుగుకు తెగులు పట్టించేలా వాడుతున్నారు. ఇక కొందరు గాయకులు అచ్చమైన తెలుగు పదాలు వాడుతున్నా మరికొందరు మాత్రం వారి పాటల్లో తెలుగే కనిపించడం లేదు. దీంతో తెలుగు పాటలు పాడాలని చాలా మంది తెలుగు పండితులు కోరుతున్నారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషను తప్పని సరి చేయడం లేదు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కువగా ఆంగ్లానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంగ్లంతో పాటు తెలుగును కూడా కాపాడాలని అంటున్నారు.
Also Read: Bangarraju Movie: బంగార్రాజు సినిమా నుంచి ” నా కోసం ” సాంగ్ రిలీజ్…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తమ ప్రాంతీయ భాషను తప్పనిసరిగా చేయాలని ప్రకటించినా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ భాష పరీక్ష తప్పనిసరి చేసింది. భాషాభిమానం ఎక్కువగా ఉన్న తమిళనాడులో ఇలాంటినిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు తప్పనిసరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Unstoppable Show: బాలయ్య “అన్ స్టాపబుల్” షో కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు…