Aadhaar PAN linking: నేటితో 2025 సంవత్సరం ముగుస్తోంది. చాలామంది ఇయర్ ఎండింగ్ డేను ఘనంగా జరుపుకుంటారు. విందులు వినోదాలతో సందడి చేస్తారు. ఈ ఎంజాయ్మెంట్ ప్రతి ఏడాది ఉండేదే గాని.. ఈసారి డిసెంబర్ 31 తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ అదేంటంటే..
డిసెంబర్ 31 లోపు పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఒకవేళ ఇలా గనుక లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని స్పష్టం చేసింది.. అలా జరగకుండా ఉండాలంటే కచ్చితంగా పాన్ కార్డు హోల్డర్లు ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించింది. ఒకవేళ లింక్ చేయని పక్షంలో పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డు ద్వారా ఇతర ఆర్థిక వ్యవహారాలు కొనసాగించలేరని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. లింక్ చేయని పాన్ కార్డు ఇకపై ఎటువంటి ఆర్థిక వ్యవహారాలలో వినియోగంలో ఉండదని ఆదాయపు పనుల శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేయడంలో.. నగదు స్వీకరించడంలో.. లేదా ఇతర ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో సమస్యలు ఎదురవుతాయని.. అందువల్ల పాన్ కార్డు ను, ఆధార్ తో లింక్ చేయాలని ఆదాయపు పని శాఖ ప్రకటించింది. డిసెంబర్ 31లోగా ఇది పూర్తి చేయాలని.. సూచించింది.
ఎలా లింక్ చేయాలి
పన్ను చెల్లింపుదారులు ఈ దశలను అనుసరించడం ద్వారా ఆధార్ లింక్ పూర్తి చేయవచ్చు.
ముందుగా ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ (https://www. Income tax.gov.in/iec/foportal) లోకి లాగిన్ అవ్వాలి..
ప్రొఫైల్ విభాగానికి నావిగేట్ చేసి.. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి.
పాన్, ఆధార్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఈ పే టాక్స్ ద్వారా చెల్లింపు ప్రక్రియను కొనసాగించాలి.
అసెస్మెంట్ సంవత్సరం వర్తించే విధానాన్ని ఎంచుకొని.. చెల్లింపులకు సంబంధించిన రసీదులను సెలెక్ట్ చేసుకోవాలి.
చెల్లించాల్సిన మొత్తాన్ని ధ్రువీకరించి.. అనంతరం క్లిక్ చేయాలి. చలాన్ రూపొందించి.. బ్యాంకు పోర్టల్ ద్వారా చెల్లింపులు జరపాలి.
చెల్లింపుల ప్రక్రియ విజయవంతమైన తర్వాత లింకింగ్ ప్రక్రియను ఖరారు చేసేందుకు ఈ ఫైలింగ్ పోర్టల్ కు మళ్లీ వెళ్లాలి.
పాన్, ఆధార్ నెంబర్లను, పేర్లను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ పై క్లిక్ చేయాలి. ఆధార్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ తర్వాత దానిని ఎంట్రీ చేసి.. సబ్మిట్ ఆప్షన్ నొక్కాలి. దీంతో ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.
ఇది పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరణ కోసం వివరాలను UIDAI కి పంపిస్తుంది. ప్రక్రియ మొత్తం విజయవంతంగా పూర్తయిందని నిర్ధారించుకోవడానికి ఒకటి లేదా రెండు రోజుల తర్వాత లింకేజీ స్టేటస్ ను పరిశీలించవచ్చు.
ఎలా ధ్రువీకరించాలంటే
ఒకవేళ పాన్, ఆధార్ గనక లింక్ చేసి ఉంటే.. దానిని తెలుసుకోవడం సులభం. ముందుగా ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ ఫోటోలు కి వెళ్ళాలి. ఆధార్ లింక్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ లింక్ అయి ఉంటే.. సక్సెస్ఫుల్ లింక్డ్ ప్రీవియస్ అని విండో మీద మెసేజ్ వస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. UAD PAN space 12 అంకెల ఆధార్ నెంబర్ స్పేస్ పది అంకెల పాన్ నెంబర్ టైప్ చేసి 567678 లేదా 56161 కి పంపవచ్చు. ఉదాహరణకు UAD 3 4 5 1 2 3 5 9 7 9 1 REGID 24 31M.