Traffic Pending Challans: తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపుకు అవకాశం ఇచ్చింది. మొదట మార్చి 1 నుంచి 31 వరకు వుకు గడుఅవకాశం కల్పించింది. తరువాత వినియోగదారుల సౌకర్యార్థం మళ్లీ ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో చలాన్ల చెల్లింపునకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో సర్వర్ల సమస్యతో కొంత జాప్యం జరిగింది. చలాన్ల చెల్లింపునకు ప్రజలు ముందుకు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది.

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించింది. 25 శాతం చెల్లించేలా నిబంధనలు మార్చింది. దీంతో వినియోగదారులు చలాన్ల చెల్లింపుకు ముందుకొచ్చారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం బాగానే వచ్చింది. ఇంకా పెండింగ్ చలాన్లు ఉండటంతో అధిాకారులు ప్రజలు త్వరపడాలని సూచిస్తున్నారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ముందుకొచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read: Ganta Srinivasa Rao: స్తబ్ధత వీడిన గంటా.. మారుతున్న విశాఖ రాజకీయాలు
నేటితో గడువు ముగిసిపోతే వినియోగదారులు తిప్పలు పడాల్సి వస్తోంది. అందుకేు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని చలాన్లు చెల్లించాలని కోరారు. మార్చి 31 నాటికి రూ. 250 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. దీంతో గడువును మళ్లీ నేటి వరకు పొడిగించడంతో ప్రజలు మీ సేవ కేంద్రాల ద్వారా చలాన్ల బిల్లులు కట్టవచ్చని సూచిస్తన్నారు.

రాయితీ వర్తింపును గడువులోగా క్లియర్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. గడువు ముగిసిన తరువాత రాయితీ ఉండదని సూచిస్తున్నారు. అందుకే రాయితీని ఉపయోగించుకోవాలని ఆన్ లైన్ లో తమ చెల్లింపులు చేసుకోవాలని పేర్కొన్నారు. టూవీలర్ పై 75 శాతం డిస్కౌంట్ ఉండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు 70 శాతం ఆఫర్ ఇచ్చింది. లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్స్ కు 50 శాతం రాయితీ ఇవ్వడం జరిగింది.
అలాగే తోపుడు బండ్లకు 50 శాతం రాయితీ, మాస్కు ధరించని వారికి రూ.900 డిస్కౌంట్ ఇచ్చి రూ. 100 చెల్లించేలా సూచించింది. దీంతో ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చలాన్లు చెల్లించాలని పోలీసు శాఖ చెబుతోంది.
Also Read:Power Cuts In Telangana: కేసీఆర్ సార్.. ఇలా ‘కరెంట్’ షాకిస్తాడని అనుకోలేదు..!
[…] Also Read: పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఇవాళే చ… […]
[…] Also Read: పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఇవాళే చ… […]