Ranbir Kapoor-Alia Bhatt Marriage: బాలీవుడ్ లో రణబీర్ కపూర్ మరియు అలియా భట్ కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారు అనే వార్తలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందరూ అనుకున్నట్టే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని అధికారికంగా ప్రకటించి ఎట్టకేలకు నిన్న మిత్రులు సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు..ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసిన వీరి పెళ్లి కి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి..చూడముచ్చటగా అనిపిస్తున్న ఈ ఫోటోలను చూస్తే ఎవరికైనా ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అథెర్ లాగ అనిపించక తప్పదు..ఇది ఇలా ఉండగా అలియా భట్ సినిమాల్లోకి రాక ముందే రణబీర్ కపూర్ కి చాలా పెద్ద ఫ్యాన్..చేసుకుంటే ఇలాంటి వాడినే పెళ్లి చేసుకుంటాను అంటూ పలు సందర్భాలలో చెప్పింది కూడా..ఆమె మాటవరుసకి అన్న ఆ మాటలు ఈరోజు నిజం అవుతాయి అని బహుశా వాళ్లిదరు కూడా ఊహించి ఉండకపోవచ్చు అనే చెప్పాలి..బాలీవుడ్ లో ఈ జంట కలిసి ఇంతకు ముందు ఒక్క సినిమాలో కూడా నటించలేదు..కానీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అని అందరిలో సందేహం రావడం సహజమే..ఎందుకంటే ఒక్క సినిమా కోసం ఒక్క హీరో మరియు హీరోయిన్ కలిసి మూడు నెలలు లేదా ఏడాది పాటు కలిసి ప్రయాణించాల్సి వస్తుంది.

అలా ఒక్క సినిమా కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సమాయం లో అన్ని కలిసి వస్తే ఇద్దరు మనసులు ఒక్కటి అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తుంది..కానీ ఒక్క సినిమాలో కూడా అంతకు ముందు వీరు కలిసి నటించనప్పటికీ ఎలా ఒక్కటి అయ్యారు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..అయితే రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో బయటా మంచి స్నేహితులు అని..వారిద్దరి మధ్య ఉన్న ఆ స్నేహమే ప్రేమగా మారింది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..దానికి తోడు వీళ్లిద్దరు మొదటిసారి హీరో హీరోయిన్లు గా కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు మూడేళ్ళ నుండి ఈ సినిమా చిత్రీకరణ ని జరుపుకుంటూ ఉంది..ఈ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇంకా బలపడింది అని బాలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న వార్త..ఏది ఏమైనా చూడముచ్చటగా ఉండే ఈ జంట ఒక్కటి అవ్వడం తో వీళ్లిద్దరి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి.

Also Read: ఏది పెద్ద హిట్.. ఎవరు గొప్ప డైరెక్టర్.. త్రిబుల్ ఆర్ తో కేజీఎఫ్-2 ను పోలుస్తున్న ఫ్యాన్స్..
బాలీవుడ్ లో ఈ ఇద్దరికీ యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ లు సాధించడమే కాకుండా, అద్భుతమైన నటులు గా వీరిద్దరికి మంచి పేరు ఉన్నది..మూడేళ్ళ క్రితం ఆయన హీరో గా నటించిన సంజు అనే సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ ని వసూలు చేసింది..ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఆయన వెండితెర మీద కనిపించలేదు..దాదాపుగా తన నాలుగేళ్ల విలువైన సమయాన్ని బ్రహ్మాస్త్ర అనే సినిమా కోసమే కేటాయించాడు..భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..అలియా భట్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆమె వేరే సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది..ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన గంగు భాయ్ మరియు #RRR చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాలుగా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బ్రహ్మాస్త్ర సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అదే స్థాయి విజయం సాధిస్తుంది అనే గట్టి నమ్మకం తో ఉంది అలియా భట్..మరి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుతుందో లేదో చూడాలి.
Also Read: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్