https://oktelugu.com/

‘లక్ష్మీవిలాస్’ ఎఫెక్ట్: ఏ బ్యాంకు సేఫ్?

లక్ష్మీవిలాస్ బ్యాంకు కరోనా ఎఫెక్ట్ తో నిండా మునిగింది. అందులోని కష్టమర్లను నిండా ముంచింది. ప్రైవేట్ బ్యాంకు చేసిన ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు కష్టమర్లు లబోదిబోమంటున్నారు. బ్యాంకు కూరుకుపోవడంతో ఖాతాదారుల డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పంజాబ్, మహారాష్ట్ర బ్యాంకులు సైతం ఇదే విధంగా నష్టాలపాలై ఖాతాదారులకు పరిమితులు విధించాయి. తాజాగా లక్ష్మీవిలాస్ బ్యాంకు కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 2:04 pm
    Follow us on

    లక్ష్మీవిలాస్ బ్యాంకు కరోనా ఎఫెక్ట్ తో నిండా మునిగింది. అందులోని కష్టమర్లను నిండా ముంచింది. ప్రైవేట్ బ్యాంకు చేసిన ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు కష్టమర్లు లబోదిబోమంటున్నారు. బ్యాంకు కూరుకుపోవడంతో ఖాతాదారుల డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పంజాబ్, మహారాష్ట్ర బ్యాంకులు సైతం ఇదే విధంగా నష్టాలపాలై ఖాతాదారులకు పరిమితులు విధించాయి. తాజాగా లక్ష్మీవిలాస్ బ్యాంకు కూడా మునిగిపోయింది. దీంతో ఆర్బీఐ దీన్ని టేకప్ చేసింది.

    Also Read: బీజేపీకి అంత సీన్‌ ఉందా..!

    కేంద్ర ప్రభుత్వం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే అందులోంచి కేవలం రూ.5 లక్షలకు వరకు మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆ బ్యాంకు నుంచి ఖాతాదారుడు రూ.5 లక్షలకు మించి తీసుకోరాదు. ఈ పరిణామాలతో ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి భయపడుతున్నారు తాజాగా లక్ష్మీవిలాస్ బ్యాంకులో రూ.5లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారు తమ డబ్బును లాక్కొనేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

    దీంతో అసలు బ్యాంకులో డబ్బు దాచుకుంటే సేఫా? లేక వేరే మార్గాల్లో నిల్వ చేయాలని కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనిపై కొందరు బ్యాంకు నిపుణులు సలహాలిస్తున్నారు. ఒక బ్యాంకులో ఎక్కువమొత్తాన్ని ఉంచకుండా రెండు, మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మంచిదంటున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేర్లమీద డిపాజిట్లను విభజిస్తే ఒక వేళ బ్యాంకు నష్టానికి గురైనా మనీ సేఫ్ గా తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

    Also Read: ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి తెలుసుకుందాం

    తమ సొమ్మను ఎక్కువ మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చంటున్నారు. అయితే అది ప్రభుత్వ బ్యాంకు అయితే బెటరని సూచిస్తున్నారు. ఎక్కువ వడ్డీకి ఆశపడి ప్రైవేట్ బ్యాంకుల జోలికి పోకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేసినా తమ మొత్తాన్ని ప్రభుత్వం నుంచైనా చెల్లించే అవకాశం ఉంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్