
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గుంభనంగా ఉంది. అయితే.. అది తుఫాను ముందరి ప్రశాంతతా? లేక వాస్తవ ముఖచిత్రమేనా? అన్నది క్లారిటీ రావట్లేదు. తెలంగాణలో అయితే.. జనం నాడి తెలిసిపోయింది. అధికార పార్టీ టీఆర్ఎస్ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కూడా వెల్లడైంది. మరి, జగన్ సర్కార్ మీద జనాభిప్రాయం ఏంటి? అన్నది తెలియట్లేదు. ఈ విషయం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం తెలియజేస్తోందంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నిక ఫలితాల తరువాత ఏపీలో రాజకీయాలపై ఓ స్పష్టత వస్తుందంటున్నారు. తిరుపతి సీటును గతంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుచుకున్న నేపథ్యంలో రాబోయే ఫలితాలు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నాయని అంటున్నారు.
Also Read: ఏపీపై బీజేపీ రెండు సర్జికల్ స్ట్రైక్స్? జగన్ పైనేనా?
ఎన్నో లెక్కలు తేలనున్నాయి..
తిరుపతి ఎస్సీ రిజర్వ్డు సీటు. ఈ లోక్ సభ స్థానం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీరు ఎవరికి మద్దతు తెలుపుతారన్నది ప్రశ్న. వైసీపీ ఆవిర్భావం నుంచీ ఎస్సీలు ఆ పార్టీ వైపే ఉంటూ వచ్చారు. ఇపుడు కనుక వారి ఓట్లలో చీలిక వస్తే.. అది వైసీపీకి తగిలిన దెబ్బగా చూపెట్టాలని యోచిస్తున్నాయి విపక్షాలు. అంతేకాకుండా.. రాయలసీమలో జగన్ బలం అలాగే ఉందా.. తగ్గిందా? అన్నది కూడా ఈ ఎన్నిక తేల్చి చెప్పబోతున్నాయి. మరో ముఖ్యమైన నిర్ణయంపైనా జనం అభిప్రాయం చెప్పనున్నారు. అదే.. మూడు రాజధానుల నిర్ణయం. దీనిపై జనాలు సానుకూలంగా ఉనారా? లేదా? అనే విషయంపైనా ఓ అంచనాకు రావొచ్చు. ఇంకా.. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల జనం సంతృప్తిగా ఉన్నారా లేరా? అన్నది కూడా ఈ ఎన్నిక తేల్చబోతోంది.
Also Read: ఏపీ దశ మారనుందా?
బీజేపీకి పరీక్షే..
తెలంగాణలో దుబ్బాక, జీహీచ్ ఎంసీ ఫలితాలతో.. ఏపీలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మరి, జనం బీజేపీ పట్ల ఏ వైఖరితో ఉన్నారనే విషయాన్ని కూడా తిరుపతి ఎన్నిక క్లియర్ చేయనుంది. ఇదే సీటులో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీకి కేవలం ఒకశాతం కన్నా కాస్త ఎక్కువ ఓట్లు వచాయి. మరి, ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
టీడీపీ లెక్క ఇదీ…
ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఈ ఎన్నికపై ఆ పార్టీ కూడా పెద్ద ఆశలేవీ పెట్టుకోవడంలేదని సమాచారం. కారణం అక్కడ పెద్దగా బలం లేకపోవడం. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 2.28 లక్షలు. టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్లు దాదాపు అయిదు లక్షలు. ఇప్పుడు పార్టీ పరిస్థితి కూడా అంత ఊపు మీద లేదు. కాబట్టి.. తమకు గతంలో వచ్చిన ఓట్లు పెంచుకొని.. వైసీపీ ఓట్లు తగ్గిస్తే చాలు అనే లెక్కల్లో ఉన్నట్టు సమాచారాం. తద్వారా రెండో స్థానంలో నిలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే.. చూపి అధికార పార్టీపై జనం వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసుకోవచ్చు అనే ఆలోచనలో సైకిల్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా.. ఇన్ని అంచనాలు, ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్న తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.