
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40 వేల లోపు కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా 30 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 20.071 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 336 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,84,100గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,43,355కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,52,586 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 93,88,159గా ఉంది. నిన్న ఒక్కరోజే 8,55,157 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎం ఆర్ తెలిపింది.