https://oktelugu.com/

సంచలనం: తిరుపతి పార్లమెంట్ కు మేనిఫెస్టో విడుదల

తిరుపతి ఉప ఎన్నికల వేడిని బీజేపీ-జనసేన కూటమి రగిల్చింది. ఈ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఏకంగా తమను గెలిపిస్తే ఏమేం చేస్తాయన్నదానిపై మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేవలం ప్రచారానికే పరిమితమైన వేళ.. అంతకుమించి తిరుపతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ బీజేపీ-జనసేన కూటమి ఏకంగా ‘మేనిపెస్టో’ను రిలీజ్ చేసి తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చింది. తమను గెలిపిస్తే చేసే అభివృద్ధి సంక్షేమంపై కీలక అంశాలను ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2021 / 07:38 PM IST
    Follow us on

    తిరుపతి ఉప ఎన్నికల వేడిని బీజేపీ-జనసేన కూటమి రగిల్చింది. ఈ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఏకంగా తమను గెలిపిస్తే ఏమేం చేస్తాయన్నదానిపై మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేవలం ప్రచారానికే పరిమితమైన వేళ.. అంతకుమించి తిరుపతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ బీజేపీ-జనసేన కూటమి ఏకంగా ‘మేనిపెస్టో’ను రిలీజ్ చేసి తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చింది. తమను గెలిపిస్తే చేసే అభివృద్ధి సంక్షేమంపై కీలక అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

    తిరుపతి పార్లమెంటు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, కలియుగదైవం  వేంకటేశ్వరుని కరుణా కటాక్షములతో శతాబ్దాలుగా విరాజిల్లుతున్న ప్రాంతం, దురదృష్టవశాత్తు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఇక్కడి నుండి పార్లమెంటుకు ఎన్నికైన వారి నిరాశక్తత కారణంగా వెనుకబాటుతనానికి గురి చేయబడింది. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని  కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వలనే సాధ్యమయ్యింది. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్  వంటి సంస్థలయినా, స్మార్ట్ సిటీ నగరం అయినా, రోడ్డు, రైల్వే, పోర్ట్ అనుసంధాన అభివృద్ధి అయినా అంతా కేంద్ర ప్రభుత్వానిదే.  ఈ క్రమంలోనే బీజేపీని గెలిపిస్తే చేసే పనులపై బీజేపీ ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది., ఇక్కడి నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కె. రత్నప్రభను ఎన్నుకుంటే, ఎంపీ కృషితో మరింత సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ -జనసేన కూటమి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

    • ఆధ్యాత్మిక రంగం అభివృద్ధి చేస్తాం

    పుణ్యక్షేత్రమయిన తిరుపతి నగరాన్ని ప్రపంచ హిందూ ధర్మ క్షేత్రంగా వికాసం చేయటం ప్రథమ కర్తవ్యం అని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.  అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయటం హిందూ సంస్కృతి, కళలకు తిరుపతిని కేంద్రంగా చేయటం. టిటిడిని ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఉంచడం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ నియంత్రణ నుండి తొలగించి ఒక సాధికారకత గల బోర్డు పరిధిలో హిందూ ధర్మకర్తల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపడుతామని మేనిఫెస్టోలో పేర్కొంది.

    • నైపుణ్యత, ఉపాధి కల్పన

    తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం చేతి వృత్తులకు, చేనేత, కలంకారీ వంటి కళానైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రదేశం. ఈ కళలను కాపాడుకోవటమే కాకుండా, ఆధునిక అభివృధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం బిజెపి అనేక మార్గాలను అన్వేషిస్తుందని మేనిఫెస్టోలో బీజేపీ-జనసేన హామీనిచ్చింది. ఉన్నత విద్య అభ్యసించే వారందరికీ, స్థానిక చేతివృత్తులలో నైపుణ్యత కలిగించటాన్ని పాఠ్యాంశంలో భాగం చేస్తామని హామీనిచ్చింది. భారీ పెట్టుబడులతో, ఎగుమతుల కోసం మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్మైల్ పార్క్ (మిత్ర) ను తిరుపతి పార్లమెంటులో స్థాపిస్తామని తెలిపింది.  చేతి వృత్తులలో నైపుణ్యత కలిగిన వారందరికీ పనిముట్లకు ఆర్థిక సహాయం చేయటం, బ్యాంకు ఋణాల సదుపాయం కల్పించటం, కొత్త

    • మెలకువల కోసం సాంకేతిక నైపుణ్యం అందించటం

    కేంద్ర ప్రభుత్వం, తిరుపతి పార్లమెంటు పరిధిలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లను, రెండు పారిశ్రామిక నగరాలను స్థాపిస్తుందని హామీనిచ్చింది. స్థానిక యువతీ, యువకులకు సరైన నైపుణ్యాలను అందించటం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను స్థాపించి, ట్రైనింగ్ ఇచ్చిన ఇక్కడే ఉద్యోగావకాశాలు కలుగజేయటం జరుగుతుందని తెలిపింది. ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకు బ్రాంచ్ నుండి కనీసం ఇద్దరు SC/ST మరియు మహిళలకు పరిశ్రమల స్థాపనకు కోటి రూపాయల వరకు పూచీకత్తు లేకుండా ఋణ సదుపాయం కల్పిస్తామంది. స్వయం ఉపాధి కోసం యువతకు విస్తృతంగా ముద్ర రుణాలు మంజూరు చేస్తామని హామీనిచ్చింది.

    • సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి

    ప్రతి మండలంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో, అధునాతన సదుపాయాలతో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.  చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో నూతనంగా క్రిటికల్ కేర్ ఆసుపత్రులను త్వరితగతిన ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద తిరుపతి పార్లమెంటు పరిధిలో ఒక క్రొత్త మెడికల్ కాలేజి (హాస్పిటల్ తో కూడిన) స్థాపించే విధంగా చర్యలు చేపడుతామని పేర్కొంది.

    • విద్యకు పెద్దపీట

    మంచి సదుపాయాలతో ప్రతి పాఠశాల భవన, వసతుల నిర్మాణం మెరుగు పరచటం బాధ్యత అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  తిరుపతి పార్లమెంటు పరిధిలో 30 కి పైగా పాఠశాలలను నూతన విద్యావిధానం క్రింద అధునాతనంగా మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దటం భక్తకన్నప్ప పేరు మీద తిరుపతి పార్లమెంటులో ‘ఏకలవ్య’ రెసిడెన్షియల్ పాఠశాలను 48 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులత ఏర్పాటు చేస్తామని తెలిపింది.  పదోతరగతి దాటి పైచదువులు చదివే దళిత విద్యార్థులందరికీ, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందజేయస్తామని తెలిపింది.

    • తిరుపతిలో రోడ్ల విస్తరణకు పెద్దపీట

    తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని పట్టణాలలో, గ్రామాలలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వేలాదికోట్ల రూపాయ నిధులను ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి త్వరితగతిన రోడ్ల నిర్మాణం చేపడుతామని మేనిపెస్టోలో పేర్కొన్నారు.

    • పట్టణాభివృద్ధికి పట్టం

    కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ పథకాల అమలు రాష్ట్రంలో నత్తనడకన నడుస్తోందని..  అలాగే, ఉచిత గృహాల నిర్మాణం, పంపిణీలో ఆలస్యం జరుగుతోందని.. ఉచిత గృహాలను లబ్ధిదారులకు వెంటనే అందేలా చొరవతీసుకుంటామని బీజేపీ-జనసేన హామీనిచ్చింది. ప్రతి పుణ్యక్షేత్రంలో, నగరాలలో వారికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.  ఇందులో ప్రధానంగా, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు రద్దీ ఉన్న అన్ని ప్రాంతాలలో వసతులను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.  తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రధాన నగరాలను ప్రతిరోజూ లక్షలాదిమంది సందర్శిస్తుంటారు. తిరుపతి, శ్రీకాళహస్తి వంటి వాటిల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చింది.

    • తాగునీటి సరఫరా

    కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం “జలమే జీవనం” పథకాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

    • ప్రతి కుటుంబానికి ఉచిత గృహవసతి

    *  ప్రతి కుటుంబానికి రైతులకు, మత్యకారులకు, చేనేత మరియు స్వయం ఉపాధి కలిగిన వారికి) తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణ సదుపాయం.

    • వ్యవసాయం

    కేంద్రప్రభుత్వ వ్యవసాయ సెస్ నిధుల ద్వారా మార్కెట్ యార్డుల ఆధునికీకరణ, శీతల గిడ్డంగుల నిర్మాణం, రైతులకు విత్రాంతి గదులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అందజేత. రెండు లక్షలు తగ్గకుండా తక్కువ వడ్డీతో ఋణ సౌకర్యం ప్రతి రైతుకు సాగునీటి సేద్యానికి వెసులుబాటు. పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ సాగునీటి పథకం క్రింద చేయూతనిస్తామన్నారు.  పాల ఉత్పత్తి దారులు , గొర్రె పెంపకం దారులకు బ్యాంకుల నుండి కిసాన్ క్రెడిట్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

    • మత్స్య రంగం

    ప్రతి మత్స్యకార కుటుంబానికి కిసాన్ క్రెడిట్ కార్డు అందజేత, తద్వారా ప్రతి కుటుంబానికి కనీసం 2 లక్షల రూపాయలకు తక్కువ పడ్డీతో  సదుపాయం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చారు.  పులికాట్ సరస్సు దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పునీటి సరస్సు, సరస్సు విస్తీర్ణం 759 చదరపు కిలోమీటర్లు. సముద్ర ముఖద్వారం పూడిక కారణంగా, మత్స్యసంపద తగ్గిపోతోంది. పులికాట్ సరస్సులోని పూడికను తీసివేసి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు.  పులికాట్ సరస్సు కొంత ప్రాంతం తమిళనాడులో, కొంత ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. వీటికి సరిహద్దులు గుర్తించని కారణంగా, తరచుగా రెండు ప్రాంతాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని రీసర్వే చేయించి హద్దులు నిర్ణయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎనిమిది ఫిష్ హార్బర్లను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించడం, పైన పేర్కొన్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, తిరుపతి ప్రాంత ఆర్థిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాలవారికి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చొరవ తీసుకోవటం జరుగుతుందని బీజేపీ హామీనిచ్చింది. తిరుపతి పార్లమెంటులో బిజెపి ప్రతిష్టాత్మకంగా ఒక ఆదర్శ అభివృద్ధి సాధనకు నిదర్శనంగా తీర్చిదిద్దుతుంది.

    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు తిరుపతిలో బీజేపీ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరుపార్టీల ముఖ్య నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు   సోము వీర్రాజు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, , బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి  రత్న ప్రభ, బిజెపి ముఖ్య నేతలు కన్నా లక్ష్మీనారాయణ,   విష్ణు వర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్,   జీవీఎల్ నరసింహారావు, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్,  మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.

    మేనిఫెస్టో ఇదే..

    Manifesto_ 2 Pages (1)