
మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే పార్టీలు తమ క్యాండిడేట్లను ఫైనల్ చేశాయి. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని అన్ని పార్టీలూ తాపత్రయంలో ఉన్నాయి. మరోవైపు.. జగన్ ఏడాదిన్నర పాలనకు ఈ ఎన్నికలు గీటురాయి కానున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏడాదిన్నర తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు ఇవి. అందుకే.. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలని వైసీపీ కూడా తహతహలాడుతోంది.
Also Read: ప్రకాశ్ రాజ్ కు మొదలైన సెగ..పనికిమాలినవాడు.. నాగబాబు కౌంటర్..!
అందుకే.. ఈ ఉప ఎన్నికపై జగన్ ఆచితూచి పావులు కదుపుతున్నారు. సింపతి ఓటింగ్ అంటూ ప్రతిపక్షాలు తన విజయాన్ని తీసిపారేసే అవకాశం లేకుండా బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని ఈ ఎన్నికకు దూరం పెట్టారు. ఇక ఎలాంటి రాజకీయ అనుభవం లేని కొత్త అభ్యర్థిని బరిలో దింపుతున్నారు. అంటే ఈ ఎన్నిక కేవలం జగన్ కటౌట్‌పై జరుగుతున్నదే. అందుకే.. తన పాలన భేష్ అని నిరూపించుకునేందుకే జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే.. జగన్ తిరుపతి లోక్‌సభ స్థానంపై అంతగా టెన్షన్ పడాల్సిన పనికూడా లేదేమో. ఎందుకంటే.. గత సార్వత్రిక ఎన్నికలు ముగిసి.. అధికారం చేపట్టాక కూడా జనం ఆయన వెంటే ఉన్నారు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఓ వైపు రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా.. తనదైన శైలిలో సంక్షేమ పథకాలు రన్ చేస్తూ ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారు. కరోనా టైంలోనూ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయించిన ఘనతను సొంతం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా జై జగన్ అంటున్నారు.
Also Read: సీఎం జగన్ గొప్ప మనసు.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు తనయుడు ఎస్పీ చరణ్
ఇంతవరకు బాగానే ఉన్నా.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మొన్నటి వరకు తిరుగులేని పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. అది ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు పెద్ద గాయంలా మారింది. అయితే.. ఈ ఉప ఎన్నికతో జగన్‌కు కూడా టెన్షన్ పట్టుకుందట. అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా ఆ సీటును టీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సింపతిని ఓటు కూడా పరువు దక్కించలేకపోయింది. ఆ ఎన్నికలో కేసీఆర్ టీమ్ చేసిన తప్పులను తిరుపతి ఎన్నికల్లో రిపీట్ చేయకూడదని జగన్ భావిస్తున్నారు. ఇటీవల తిరుపతి సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో సమీక్ష నిర్వహించి ఇదే విషయం ఖరాఖండిగా చెప్పేశారు. అభ్యర్థి ఎవరైనా తాము ఘన విజయాన్ని సాధించుకుని వస్తామని అందరి వద్దా మాట తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్