Tirupati Assets: ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ప్రకటించింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తుల విలువలను టీటీడీ ఆలయ మండలి సభ్యులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు, వాటి విలువను టీటీడీకి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 960 ఆస్తులున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈమేరకు మండలి సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో శ్రీవారి ఆస్తుల విలువ రూ. 85,705 కోట్లని ప్రకటించారు. ఇది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని, మార్కెట్ విలువ కనీసం 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని, దాదాపు రూ.2 ఉంటుందని అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1974 నుంచి 2014 మధ్య వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వివిధ టీటీడీ ట్రస్టులు వివిధ కారణాలతో ఆలయ ట్రస్టుకు చెందిన 113 ఆస్తులను తొలగించాయని తెలిపారు. 2014 తర్వాత నేటి వరకు టీటీడీ ఆస్తులేవీ అమ్మలేదని, ఇతర అవసరాలకు కేటాయించలేదని స్పష్టం చేశారు.

ఈ ఆస్తులను ప్రస్తుతం టీటీడీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తామన్నారు. వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14,000 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరియు దాదాపు 14 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉన్న టీటీడీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయ సంస్థగా ప్రచారం పొందింది.
కీలక ప్రాజెక్టులకు బడ్జెట్..
ఈసారి శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.
– రూ.95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం, రూ.30 కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు.
– శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయించామని వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.
రూ.2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్, రూ.3 కోట్లతో నెల్లూరులో కల్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
– బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీజేస్తా మని పేర్కొన్నారు.