Aishwarya Rai: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని దాదాపు 500 వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని సరికొత్త విజువల్ వండర్ గా తీసుకువస్తున్నారు. అయితే, ‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా టీం అంతా దేశమంతా తిరుగుతోంది. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా హీరో కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం, కుండవై పిరట్టియార్ గా త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీరంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్, కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి వంటి భారీ తారాగణం అంతా ఇండియాలోని పెద్ద సిటీలకు వెళ్లి మరీ సినిమాని ప్రచారం చేస్తున్నారు. ఐతే ఏ సిటీకి వెళ్లినా, ఎక్కడా ప్రచారం చేసినా కెమెరా కళ్ళు ఐశ్వర్యారాయ్ పైనే నిలుస్తున్నాయి. విక్రమ్, జయం రవి, కార్తీ లాంటి ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నా.. కెమెరా కళ్ళు మాత్రం ఐశ్వర్యారాయ్ అందం పైనే నిమగ్నమై పోతున్నాయి.
దీనికితోడు ఐశ్వర్యారాయ్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో అదరగొడుతోంది. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యారాయ్ బయటికి రావడం ఒక కారణం. ఫైగా, ఇప్పటికీ స్లిమ్ గా ఉంది. చీరలు, డ్రెస్సులు ట్రెండీగా ఉండేలా చూసుకుంటోంది. అందుకే, ఐశ్వర్యారాయ్ ఫోటోలు, అలాగే ఆమె బాగా హైలెట్ అవుతుంది. మరోవైపు, ఈ సినిమా తమిళనాడులో, అమెరికాలో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. కాకపోతే టాలీవుడ్ లో అలాగే హిందీలో కూడా ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు.

దీనికి ప్రధాన కారణం ఈ సినిమా నేపథ్యం కూడా. 10వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రం చోళ రాజవంశం చుట్టూ సాగుతుంది. ఈ రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి కుటుంబాల మధ్య జరిగిన సమరమే ఈ చిత్రం. చరిత్రలో దాగిన వీరుల కథలకు ఫిక్షనల్ అంశాలని జోడించి మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించాడు. కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో పెద్దగా ఉండవు. అందుకే.. మాస్ ఆడియన్స్ ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారు.
అన్నిటికీ మించి లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ కావడంతో దీన్ని రెండు బాగాలుగా తీసుకొస్తున్నారు. అంతఃపురం వ్యూహాలు, కుట్రలు కుతంత్రాల సమాహారంగా ఈ చిత్రం ఉండనుంది. అందుకే ఈ సినిమాలో ఎవరూ హీరోలు కాదు. కీలకమైన పాత్రల సమాహారమే ఈ సినిమా. మరి సామ్రాజ్యం కోసం గ్రేట్ సోల్జర్స్ మధ్య జరిగిన ఈ యుద్ధం వెండితెర పై ఎలా ఉంటుందో సెప్టెంబర్ 30న చూద్దాం.