https://oktelugu.com/

టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం : సోమువీర్రాజు అరెస్ట్

కడప జిల్లా ప్రొద్దుటూరు అట్టుడికింది. బీజేపీ నేతల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు చిచ్చు పెట్టింది. ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రొద్దూటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కడప జిల్లా ప్రొద్దూటూరులో ఆందోళనకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ శ్రేణులు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2021 / 12:16 PM IST
    Follow us on

    కడప జిల్లా ప్రొద్దుటూరు అట్టుడికింది. బీజేపీ నేతల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు చిచ్చు పెట్టింది. ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

    ప్రొద్దూటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కడప జిల్లా ప్రొద్దూటూరులో ఆందోళనకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ శ్రేణులు కదంతొక్కాయి. ప్రొద్దూటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నాకు దిగారు. దీనికి బీజేపీ శ్రేణులు భారీగా కదిలివచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి సోము వీర్రాజు బయలు దేరారు. ఆయన వెంట భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

    వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సోము వీర్రాజును అడ్డుకొని అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు అరెస్ట్ సమయంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి సోము వీర్రాజు సహా నేతలను లాక్కేళ్లారు.
    బిజెపి నేతలు పై పోలీసులు భౌతిక దాడి చేసినట్టు నాయకులు ఆరోపించారు. బీజేపీ నేత రమేష్ నాయుడుతో పోలీసులు అతిప్రవర్తన చేశారంటున్నారు.

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు నాయకులు నాగోతు రమేశ్ నాయుడు, భానుప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో బిజెపి నేతలకు పోలీసులు మధ్య తోపులాట ఘర్షణ చోటుచేసుకుంది.

    మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సోము వీర్రాజు మాట్లాడారు. ‘ఏపీలో హిందూ మతానికి వ్యతిరేకంగా పరిపాలన సాగుతోందని విమర్శించారు. అందులో భాగంగానే టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే ఈ విగ్రహ ఏర్పాటును మానుకోవాలని.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసినా ధ్వంసం చేస్తామని సోమువీర్రాజు సంచలన హెచ్చరికలు చేశారు.