
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బాక్సర్ లవ్లీరా బొర్గొహైన్ సంచలనం సృష్టించింది. మెగా క్రీడల్లో ఘనంగా అరంగేట్రం చేసింది. ప్రిక్వార్టర్స్ లో జర్మన్ బాక్సర్ నడైన్ ఆప్టెజ్ ను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిది. తన తర్వాతి మ్యాచులో గెలిస్తే ఆమె కనీసం కాంస్యం ఖాయం చేసుకుంటుంది. తొలి రౌండ్లో లవ్లీనాకు బై లభించడం గమనార్హం.