Stand for India: అఖండ భారతావని.. వందల ఏళ్ల క్రితం సువిశాల విస్తీర్ణం.. అనేక దేశాల సమ్మేళనంతో ఉండేది. ఒకప్పుడు ఇప్పుడు ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, బూటాన్, మయన్మార్, శ్రీలంక.. ఇలా అనేక దేశాల సమ్మేళనంగా ఉండేది. కానీ, అనేక యుద్ధాలు, ఆక్రమణలు, స్వాతంత్య్ర పోరాటాలతో చాలా దేశాలు విడిపోయాయి. ఇప్పుడు భారత్ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. చూస్తే పెద్దగా అనిపించినా రష్యా, అమెరికా, కెనడాతో పోలిస్తే చాలా తక్కువే. మన దేశంలో చదరపు కిలోమీటర్‌కు 440 మంది ఉంటే.. అమెరికాలో 36 మంది, రష్యాలో కేవలం నలుగురు మాత్రమే ఉంటారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే.. భారత సంస్కృతి, వారసత్వం, ప్రజల ఐక్య, స్ఫూర్తి.. ఇతర దేశాలకన్నా మిన్న. కష్టసమయాల్లో కలిసి ఉండడం, ఐక్యంగా కష్టాన్ని ఎదుర్కొనడం మనకు అనాదిగా వస్తోంది. ఆ స్పిరిట్ భారతీయుల రక్తంలోనే ఉంది. ఇప్పుడు ఆ స్పిరిట్‌ను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం కోసం ఐక్యంగా నిలబడాల్సిన టైం వచ్చింది. ఈ స్పిరిట్‌ను ఇప్పుడు మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
Also Read: మోడీ ఒక్క అడుగు.. పాకిస్తాన్ లో వణుకు
దేశం ఫస్ట్..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇతర దేశాలను కొట్టి.. అమెరికాను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాలు ఐక్యంగా ఉండకుండా గొడవలు పెడుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. 200 ఏళ్లు భారత్‌ను పాలించిన బ్రిటిషర్లు కూడా ఇలాగే చేశారు. కానీ, స్వాతంత్య్ర పోరాటాలతో తోకముడిచారు. ఇప్పుడు అమెరికా తోక కత్తిరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం భారత్ స్పిరిట్ నేషన్ ఫస్ట్ అనేది రావాలి. గాంధీజీ స్వదేశీ ఉద్యమం భారత్‌కు స్వాతంత్య్రాన్ని తెచ్చింది. ఇప్పుడు, ఆధునిక సమయంలో, స్వదేశీ ఉద్యమం మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలబడి, స్వదేశం కోసం సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు, విదేశీ వాణిజ్య ఒత్తిళ్లను ఎదుర్కొనే సమయంలో, భారతీయులందరికీ ఒక స్ఫూర్తిగా నిలవాలి. మనం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం, ‘మేక్ ఇన్ ఇండియా‘ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచవచ్చు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, భారతీయ కష్టానికి విలువ ఇచ్చే ఒక సామాజిక బాధ్యత.
విదేశీ ఒత్తిడి..
ఇటీవల అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధించింది. భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ‘గా అభివర్ణించడం, మన ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో అవకాశం లేదని పేర్కొనడం వంటి వ్యాఖ్యలు భారతీయుల ఆత్మగౌరవాన్ని సవాలు చేస్తున్నాయి. ఈ సమయంలో, భారతీయులుగా మనం చేతులు చాచి వేచి చూడకుండా, స్వావలంబన మార్గాన్ని ఎంచుకోవాలి. మన ఎగుమతి రంగం కష్టాల్లో ఉన్న ఈ తరుణంలో, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మన కార్మికులు, వ్యాపారులు, మరియు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడాలి.
భారతీయ స్పిరిట్‌తో భవిష్యత్..
భారతీయ సంస్కృతి, వారసత్వం మనకు ఐక్యత శక్తిని నేర్పింది. కష్ట సమయాల్లో ఒకరి చేయి ఒకరు పట్టుకునే సంప్రదాయం మన సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఇప్పుడు, వినాయక చవితి వంటి ఉత్సవాల సమయంలో, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా మనం ఈ స్పిరిట్‌ను ఆచరణలో చూపించవచ్చు. ప్రతీ కొనుగోలు నిర్ణయంలో ‘మేక్ ఇన్ ఇండియా‘ లేబుల్‌ను పరిగణనలోకి తీసుకోవడం, భారతీయ కష్టానికి విలువ ఇవ్వడం మన బాధ్యత. ‘నేషన్ ఫస్ట్‘ భావనను అందరూ స్వీకరించాల్సిన సమయం ఇది.
Also Read: మోదీ అంటే ట్రంప్ కు ఎందుకు అంత మంట?
స్వావలంబనతో స్వాభిమానం..
భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, విదేశీ టారిఫ్‌లు, విమర్శలు మన దేశ స్పిరిట్‌ను దెబ్బతీయలేవు. బదులుగా, ఇవి మనలో స్వావలంబన భావనను మరింత బలోపేతం చేయాలి. స్వదేశీ ఉద్యమం ఒక ఆర్థిక వ్యూహం మాత్రమే కాదు, భారతీయ ఐక్యత. ఆత్మగౌరవాన్ని చాటే అవకాశం. ప్రతీ భారతీయుడు తన కొనుగోలు నిర్ణయాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చవచ్చు. మన దేశ కార్మికులు, చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారుల కష్టానికి విలువ ఇవ్వడం ద్వారా మనం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. ఇది కేవలం ఆర్థిక పునరుజ్జీవనం కోసం మాత్రమే కాదు, భారతీయ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయాణం. రండి, ‘నేషన్ ఫస్ట్‘ అనే మంత్రంతో ఒక బలమైన భారత దేశాన్ని నిర్మిద్దాం!