Pawan Kalyan: ఈ తరం రాజకీయాలంటేనే కత్తిమీద సాము.. అధికారం కోసం చంపడానికైనా.. చావడానికైనా తెగించే రోజులివీ.. సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తితో దాడి జరగడం.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జగన్ బాబాయ్ దారుణ హత్యకు గురికావడం చూశాక ఏపీలో ‘హత్యా రాజకీయాలు’ ఏపీలో కొనసాగుతున్నాయన్నది కాదనలేని సత్యం. అయితే ప్రత్యర్థులను చంపేంతగా అవి ఉన్నాయంటే ఎంతగా ఏపీ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అధికారం కోసం పోటీ వస్తున్నానని తనను చంపడానికి ముగ్గురు క్రిమినల్స్ ప్లాన్ చేస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. అవే వైరల్ అవుతున్నాయి.

‘ఎవరో అధికార పక్షమో.. ప్రతిపక్షమో తెలియదు కానీ ముగ్గురు క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డు చేసి పెట్టారని.. తనకు వినిపించారని.. అసలు ఎన్నికల్లో పాల్గొనకుండా పవన్ కళ్యాణ్ ను చంపేయవచ్చు కదా.. ఏం అవుద్ది ఓ నెలరోజులు గొడవ అవుద్ది.. ఈ నెపాన్ని అధికార పక్షం ప్రతిపక్షం మీద తోసేయవచ్చు.. ప్రతిపక్షం అధికార పక్షం మీద తోసేస్తే ఎన్నికల్లో మనమే గెలుస్తాం అని వాళ్లు ప్లాన్ చేశారు. ఆ మాట్లాడుకున్న ముగ్గురు క్రిమినల్స్ ఎవరో కూడా తెలుసు. ఏ పార్టీ వాళ్లో తెలుసు. ఆ వ్యక్తుల పేర్లు తెలుసు.. ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు.. ’ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఇప్పుడు తిరిగి వైరల్ అవుతున్నాయి.
రాజకీయాల్లోకి రావడమే చావును ఎదురించి వచ్చానని.. ఇలాంటి వాటికి భయపడే రకం కాదని నాడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అంతపిరికితనంతో ఉంటామా? ఇవన్నీ ఆలోచించకుండా రాజకీయాల్లోకి వచ్చామా? అని పవన్ అంటున్నారు. తన దేశం కానీ వారి సమస్యలపై పోరాడిన చేగువేరా ఆదర్శంతో ఏపీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని పవన్ తెలిపారు. ఇప్పటికీ రాజకీయాల్లో అదే పాలసీతో ముందుకెళుతున్నారు. అధికార ప్రతిపక్షాల తప్పులను ఎత్తి చూపుతున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయకపోవడానికీ ఈ హత్య రాజకీయాలు కూడా ఓ కారణం. ఆయన జనంలోకి వచ్చి పాదయాత్ర చేస్తే అభిమానులను ఆపడం ఎవరి తరం కాదు. అందుకే రోడ్డెక్కకుండా బస్సు యాత్రకు పవన్ ప్లాన్ చేశారు. రోడ్డుపై వెళితే శత్రువులు పవన్ ను ఏమైనా చేసే ప్రమాదం ఉంది. అభిమానుల ముసుగులో చంపినా చంపేస్తారు. ఈ భయాలు ఉండబట్టే జనసేన నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు పవన్ బస్సు యాత్రకు పూనుకున్నారు. పాదయాత్ర చేయాలని ఉన్నా ఈ హత్యా రాజకీయాల్లో పవన్ ను లేకుండా చేస్తారని.. ప్రజాసేవ కోసం పనిచేసే నాయకుడిని కోల్పోవడం ఇష్టం లేకనే ఇలా జనసేన పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=uFSaLGzDxC8