Homeఅంతర్జాతీయంAfghan refugees: అఫ్గన్లను అక్కున చేర్చుకుంటున్న దేశాలివీ

Afghan refugees: అఫ్గన్లను అక్కున చేర్చుకుంటున్న దేశాలివీ

Afghanistan refugeesAfghan refugees: అఫ్గనిస్తాన్(Afghanistan) లో తాలిబన్ల (Taliban) ఆగడాలు పెరిగిపోతున్నాయి. వారికి భయపడి ప్రజలు దాక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబుల్ విమానాశ్రయంలో భయానక దృశ్యాలు చూస్తుంటే ప్రపంచ సమాజానికే కన్నీరు పుడుతోంది. అఫ్గాన్ ప్రజల నిస్సహాయ స్థితిని తాలిబన్లు ఆసరాగా చేసుకుని ఆడుకుంటున్నారు. కానీ శరణార్థులను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు మాత్రం ముందుకు వస్తున్నాయి. తమ దేశాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తమలోని ఉదారతను చాటుతున్నాయి.

అఫ్గాన్ ప్రజల ప్రస్తుత పరిస్థితికి అమెరికా చలించిపోతోంది. శరణార్థుల విషయంలో అగ్రరాజ్యం తన ఉదారతను చాటుతోంది. సుమారు 30 వేల మందికి పునరావాసం కల్పించేందుకు ముందుకు వచ్చింది. రెండు దశాబ్దాల్లో ఎంతో మంది అఫ్గాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా సేనలకు సాయం చేశారు. దీంతో వారికి అండగా ఉండాలని అమెరికా భావిస్తోంది. కెనడాలో కూడా 20 వేల మందికి ఆశ్రయం కల్పించాలని భావించింది. శరణార్థుల విషయంలో అమెరికా సూచనల మేరకు కెనడా నడుచుకుంటోంది.

అఫ్గాన్ ప్రజలపై బ్రిటన్ కూడా సానుభూతి చూపిస్తోంది. అఫ్గాన్లకు సాయం అందించేందుకు దేశం కోసం పనిచేసిన వారికి పునరావాసం అందించేందుకు సిద్ధపడింది. దాదాపు ఐదు వేల మంది శరణార్థులను స్వాగతం పలకడానికి అనుమతించింది. అఫ్గాన్లకు భారత్ అంటే ప్రేమ. కష్టకాలంలో ఆదుకోవాలని నిర్ణయించింది. ఇరవై ఏళ్లలో భారత్ కు సహకరించిన వారందరికి అండగా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే చాలా మంది భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు.

ఇరాన్ కూడా ఇప్పటికే 35 లక్షల మందికి ఆశ్రయమిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ మంది దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో వీరి కోసం ఏర్పాట్లు చేసింది. అమెరికా సూచనతో ఉగాండా సైతం రెండు వేల మంది శరణార్థుల కోసం ఆశ్రయం ఏర్పాటు చేసింది. మూడు నెలలు వారంతా ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచమంతా ఇలా వారి కోసం సాయం అందిస్తున్నారు. కానీ తాలిబన్లు మాత్రం వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular