Pawan Kalyan’s leadership : లీడర్ షిప్.. అది ఊరికే రాదు.. జనాన్ని మెప్పించడం.. జనంలోంచి నాయకుడిగా ఎదగడం అందరి వల్ల కాదు. కొందరే నాయకులుగా పుడుతారు.. ఎదుగుతారు.. రాష్ట్రాలను శాసిస్తారు. వెండితెరపై ఇలవేల్పుగా ఎదిగిన చిరంజీవి సినిమాల్లో హిట్ అయినా రాజకీయాల్లో ఆయన తట్టుకోలేకపోయారు. కానీ ఆయన తమ్ముడు మాత్రం జనాలకు ఏదో చేయాలనే తలంపుతో జనంలోకి దిగారు. వారి ఆదరణ చూరగొంటున్నారు.
అయితే జనాలు ఎప్పుడు కులం కట్టుబాట్లు, మందు, విందు, డబ్బులు పంచేవాళ్లకే ఓటేస్తూ నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకే నిన్న పవన్ కళ్యాణ్ ప్రజలకు ఓ పిలుపునిచ్చాడు. తన బాధను వ్యక్తం చేశాడు. అవినీతి చేసే రాజకీయ నేతలను కాదని.. సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న తన లాంటి వారికి ఓటు వేయాలని కోరారు. మెజార్టీ ఉన్న కాపులు పెద్ద పాత్ర పోషించాలంటూ పిలుపునిచ్చాడు.
అలాంటి రాజకీయం కావాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఓ తమిళ సినిమా అనువాదపు సీన్ ను కొందరు షేర్ చేసి మరీ పవన్ నీతిమంత రాజకీయాలకు ఈ వీడియో ఒక ఉదాహరణ అని.. ప్రజలు తెలుసుకోవాలంటూ వైరల్ చేస్తున్నారు. ఎందుకో కొన్ని సార్లు కొన్ని సినిమా సీన్స్ రియల్ ఏమో అనిపిస్తాయి.
సత్తా వున్న పవన్ కళ్యాణ్ లాంటి వారు సమాజం మీద బాధ్యత వుండి చేయగలిగిన వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ముందు వుండి సమూహానికి నమ్మకం కలిగించే పవన్ వెంట నడవాలని సూచిస్తోంది. నడిపించేవాడు నాయకుడు కావాలన్న సృహను వ్యక్తం చేస్తోంది.
జనం తమ తమ శక్తి సామర్ధ్యాలతో జీవితం సాగిస్తూ తమ కష్టాలను తీర్చే నాయకుడి కోసం అశతో ఎదురుచూస్తారు. అలాంటి నాయకుడు పవన్. అందరికీ అన్నీ తెలివితేటలు వుండి ధైర్యం వుంటే నాయకుడే అవసరం లేదు. జనాన్ని అనుమానించే.. అమ్ముడు పోయారు అనేవాడు ఎవడు లీడర్ కాలేడు. పవన్ కళ్యాణ్ లాంటి నీతివంతుడైన నేత కావాల్సిన అవసరాన్ని ఈ వీడియో చక్కగా వివరిస్తోంది చూడండి..