Homeజాతీయ వార్తలుCM KCR: ఈసారి కేసీఆర్‌కు అంత ఈజీ కాదు..

CM KCR: ఈసారి కేసీఆర్‌కు అంత ఈజీ కాదు..

CM KCR: తెలంగాణ అసెంబీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి ఎన్నికలు మూడు పార్టీల మధ్య జరుగనున్నాయి. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాత్రమే ఉండేల కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఓట్లను చీల్చే అశకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు సర్వేలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ ఇస్తున్నాయి. కేసీఆర్‌ గెలుపు ఈసారి అంత ఈజీకాదని చెబుతున్నాయి.

అభ్యర్థుల ఎంపికే కీలకం..
కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి ఊపు వచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు ఆరు గ్యాంరెటీ స్కీంలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రుస్‌ కచ్చితంగా 40 నుంచి 50 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 55 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌.. త్వరలో ప్రకటించే రెండో జాబితా కీలకంగా మారనుంది. అభ్యర్థుల ఎంపిక ఆధారంగా గెలిచే సీట్లు పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.

త్వరలో రెండో జాబితా..
దసరా తర్వాత రెండో జాబితా అని కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు రెండో విడత బస్సుయాత్రకు కూడా సిద్ధమవుతోంది. తొలివిడత యాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో రెండో విడత యాత్రకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో రెండో జాబితాపైనా తీవ్ర కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.

బీజేపీ ప్రభావం అంతంతే..
ఇక తెలంగాణలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు. మహా అయితే 10 సీట్లు వరకు గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే బీజేపీ ప్రభావంతో కాంగ్రెస్‌ ఓట్లు చీలితే మాత్రం నష్టం జరుగుతుందని అంటున్నారు.

ప్రభావం చూపని కేసీఆర్‌..
2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ అత్యంత ప్రభావం చూపారు. అన్నీ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ బరిలో ఉన్నట్లుగా తన మాటలతో ఓటర్లను మెస్మరైజ్‌ చేయగలిగారు. సంక్షేమ పథకాలతో పార్టీని గెలిపించారు. అయితే ఈసారి కేసీఆర్‌ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించినా కేసీఆర్‌ మార్కు రాజకీయాలు, ప్రభావితం చేసే మాటలు పెద్దగా కనిపించలేదు. దీంతో ఈసారి కేసీఆర్‌ ప్రభావం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉండి అవే మాటలు మళ్లీ చెప్పడం వలన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version