Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 చాలా రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలో రతిక రోజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా ట్విస్ట్ అంటూ బిగ్ బాస్ ఆమెను గత ఆదివారం మళ్ళీ హౌస్ లోకి పంపించారు. రతిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరితో మాట్లాడి,అన్న నీతో మాట్లాడాలి అంటూ శివాజీ ని వీఐపి రూమ్ కి తీసుకెళ్లి కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ కోరింది రతిక. దాంతో లేదు బిడ్డా .. ఇక్కడ పర్సనల్ ఇగోలు ఏమి ఉండవు అంతా గేమ్ లో మాత్రమే అని శివాజీ చెప్పాడు.
రతిక హౌస్ లోకి వచ్చినప్పట్నుంచి చాలా సైలెంట్ గా ఉంటూ కనిపిస్తుంది.బయట ఏం జరుగుతుందో చూసి వచ్చింది. కాబట్టి బయట బాగా ఫాలోయింగ్ ఉన్న శివాజీ చుట్టూ తిరుగుతుంది. శివాజీ దగ్గర కొన్ని సహాయాలు, సూచనలు తీసుకుంది. శివాజీ ,రతిక తో మాట్లాడుతూ ‘బాగా ఆడు .. బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఎవరితోనైనా.. బాగా ఆలోచించి మాట్లాడు ఏదైనా .. తొందర పడి మాట్లాడొద్దు .. అన్నిటి కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యం.
ఈ ఎనిమిది వారాల్లో జనాలకి అర్ధమైపోయింది ఎవరు ఎలాంటి వారు అని.. ఇన్ని రోజులు డ్రామాలు ఆడి మేనేజ్ చేసుకుంటూ వచ్చినవారు ఇక ఉండరు వెళ్ళిపోతారు.లేదు ఈ మురికి లో ఎందుకు ఉండటం అనుకుంటే నా లాంటి వాడు వెళ్ళిపోతారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పాడు శివాజీ.
ఈ హౌస్ లో ఉన్నన్ని రోజులు నీ క్యారెక్టర్ మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకో కప్ గెలిచినా .. గెలవక పోయినా అది చాలా ముఖ్యం.నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నా. లోపల ఒక మాట బయట ఒక మాట్లాడటం నాకు నచ్చదు.ఏదైనా పేస్ టు పేస్ నేను అలానే ఉంటాను అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.ఇదంతా వింటూ నిల్చుంది రతిక. చూడాలి మరి రతిక నిజంగానే మారిందా లేక నటిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.
https://twitter.com/BBTeluguViews/status/1716721184547746252