Pavan Kalyan Fans: అభిమానం అంటే గుండెల్లో ఉంటుుంది. అందులో గుడి కట్టుకుంటారు. మనదేశంలో రాజకీయ నేతలు,, క్రికెట్ స్టార్లు, సినిమా హీరోలకు వీరాభిమానులుండటం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో నటి ఖుష్బూ కోసం గుడి కట్టి తమ అభిమానం చాటుకున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా గుడి కట్టిన వీరాభిమాని ఉన్నాడు. ఇలా అభిమానం అనేది వారి వారి స్థాయిని బట్టి చాటుకుంటుంటారు. మన తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్నంత మంది అభిమానులు ఏ హీరోకు కూడా లేరు. ఇది జగమెరిగిన సత్యం.
పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి తన వివాహ కార్డు మీద పవన్ బొమ్మ వేసుకుని అభిమానానాన్ని చాటాడు. గతంలో కూడా విశాఖపట్నం కు చెందిన ఓ అభిమాని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో అభిమాని కూడా ఇలాగే చేసి తామేమిటో నిరూపించుకున్నారు. పవన్ కల్యాణ్ అంటే పవర్ అని ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చాయని చెబుతుంటారు. పెళ్లిపత్రికలో జనసేన పార్టీ మేనిఫెస్టో వేసి పవన్ కల్యాణ్ ఫొటో, ఎన్నికల గుర్తు కూడా వేయడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read: Acharya: ‘అఖండ’కు కాపు కాస్తే.. ‘ఆచార్య’కి వెన్నుపోటు పొడిచారు !
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని కోటే హరీష్ బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈనెల 4న జరిగే వివాహానికి ముద్రించిన శుభలేఖపై పలన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతో ఆయన ఫొటోతో పాటు మేనిఫెస్టోను ముద్రించడం చర్చనీయాంశం అవుతోంది. సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని అందుకే ఇలా చేశానని చెబుతున్నాడు.
దీంతో రాష్ట్రంలో ఈ శుభలేఖ నెట్టింట్లో సందడి చేస్తోంది. అభిమానమంటే ఇంత ఉంటుందా అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలన్ కల్యాణ్ అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇంతలా భక్తిని చాటడంతో పవన్ అంటే వ్యక్తి కాదు ఒక శక్తి అని చెబుతున్నారు. ఆయన కోసం అవసరమైతే ఎంత త్యాగానికైనా వెనుకాడని భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలైనా సినిమాలైనా ఎందులోనైనా తన స్టైల్ కు అందరు ఫిదా అవుతున్నారు.
Also Read: YCP Botsa Roja: మంత్రిగా ఇంకా బాధ్యతలు తీసుకోని ‘బొత్స’..అలకకు కారణమేంటి? రోజాది అదే పరిస్థితి?
Recommended Videos: