https://oktelugu.com/

కేసీఆర్ సార్.. ఇవేనా మీ ‘డబుల్ బెడ్ రూం’లు?

ఏదైనా ఒక పథకం ప్రవేశపెడితే అందులో ప్రజా ప్రయోజనం ఎంత ఉంటుందని పాలకులు ఆలోచించాలి. అప్పుడే ఆ పథకాన్ని పదికాలల పాటు జనాలు గుర్తుంచుకుంటారు. నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులను ఇప్పటికీ జనాలు గుర్తుచేసుకుంటారు. ఆయనను మహానేతగా నిలిపారు. ఇక ఇప్పటికీ ఆయన పథకాలను తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలు కేసీఆర్, జగన్ లు కొనసాగిస్తున్నారంటే అది వైఎస్ఆర్ ఘనతే. అందుకే ఆయన జనాల దృష్టిలో చెరగని ముద్ర వేశారు. Also Read: దుబ్బాకకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 06:39 PM IST
    Follow us on

    ఏదైనా ఒక పథకం ప్రవేశపెడితే అందులో ప్రజా ప్రయోజనం ఎంత ఉంటుందని పాలకులు ఆలోచించాలి. అప్పుడే ఆ పథకాన్ని పదికాలల పాటు జనాలు గుర్తుంచుకుంటారు. నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులను ఇప్పటికీ జనాలు గుర్తుచేసుకుంటారు. ఆయనను మహానేతగా నిలిపారు. ఇక ఇప్పటికీ ఆయన పథకాలను తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలు కేసీఆర్, జగన్ లు కొనసాగిస్తున్నారంటే అది వైఎస్ఆర్ ఘనతే. అందుకే ఆయన జనాల దృష్టిలో చెరగని ముద్ర వేశారు.

    Also Read: దుబ్బాకకు పోటెత్తిన కాషాయదండు.. రఘునందన్ రావు లో గెలుపు ధీమా!

    ఇక కేసీఆర్ కూడా కొన్ని పథకాలతో తెలంగాణ ప్రజల మదిని దోచుకున్నారు. ముఖ్యంగా నీటి పారుదల, వ్యవసాయంలో సంస్కరణలు చేసి ప్రజలకు చేరువయ్యాడు. కానీ కేసీఆర్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్ల కథ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా తయారైందనే విమర్శలున్నాయి.

    ఇప్పటికే అసెంబ్లీలో కేసీఆర్ కట్టిస్తానన్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏవీ అని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విమర్శించాడు. దానికి మంత్రి తలసాని టెంప్ట్ అయిపోయి కొన్ని చూపించాడు. అవి 10వేల ఇళ్లు కూడా దాటలేదు. దీంతో ఈ పథకంపై విమర్శలు వెల్లువెత్తాయి.

    తాజాగా ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదలకు ఏమాత్రం ఉపయోగపడేలా కట్టలేదని నిరూపితమైంది. ఈ ఇళ్లను ముంపులో కట్టేశారని.. చెరువు శిఖాల్లో నిర్మించారని.. పుట్టి ముంచారని విమర్శలు వస్తున్నాయి. తాజా వర్షాలకు నిండా మునిగిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూసి లబ్ధిదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు. అక్కరకు రాని ముంపు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూంలను కట్టి ప్రజలను ముంచారని ఆడిపోసుకుంటున్నారు.

    ఏపీలోని విశాఖపట్నం-నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటిన సంగతి తెలిసిందే.దీని ధాటికి తెలంగాణ నిండా మునిగింది. ఈ క్రమంలోనే   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అప్పనపల్లి లో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తాజాగా కురుస్తున్న వర్షానికి వాగు పక్కనే ఈ ఇళ్లు ఉండడంతో వరద నీరు ఆ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి చేరి  ప్రవహిస్తుంది

    Also Read: జగన్‌ లేఖ: ప్రశాంత్ భూషణ్‌ రచ్చ చేస్తున్నాడే?

    ఈ ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్లు నిండా మునిగాయి. వాటిని చూపిస్తూ ‘కేసీఆర్ సార్.. ఇవేనా మీరు కట్టించిన డబుల్ బెడ్ రూం’ ఇళ్లు.. నిండా మునిగాయి చూడండి’ అంటూ లబ్ధిదారులు సోషల్ మీడియాలో వాపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ పేదలకు సరైన చోట ఇళ్లు కట్టించలేదని.. ముంపు ప్రాంతాల్లో అక్కరకు రాని చోట కట్టించారని.. చెరువుల్లో కట్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.