Revanth Reddy: హుజురాబాద్ లో త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని అనుకున్నా ఆ దిశగా అడుగులు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం వేట సాగించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కొండా సురేఖ బరిలో నిలిస్తే పోటీ మరోలా ఉండేది. కానీ ప్రస్తుత అభ్యర్థి ఎవరికి సుపరిచితుడు కాకపోవడమే పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఓట్లు రాలతాయి కానీ ఆయన దీన్ని అంత ప్రాధాన్యం గల ఎన్నికగా భావించడం లేదు. ఆయన దృష్టంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన హుజురాబాద్ పై ఫోకస్ పెట్టే అవకాశాలు లేవని సమాచారం. ఈ క్రమంలో హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్తి వెంకట్ ఏ మేరకు ఓట్లు సాధిస్తారోననే అనుమానాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం తన ప్రచారం ఇంకా ముమ్మరం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు సునాయాసం కాదని తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి భిన్నంగా బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం విజయమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం పెద్దగా దృష్టి సారించడం లేదు.
అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం తన ప్రతిష్ట నిలుపుకోవాలనే ఉద్దేశంతో హుజురాబాద్ లో కచ్చితంగా గెలవాలని చూస్తోంది. దళితబంధు పథకం ప్రవేశపెట్టి ఓట్లు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని కుల సంఘాలకు గాలం వేసే పనిలో పడిపోయింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అక్కడు మకాం వేసి పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఇందుకుగాను వాగ్దానాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.