https://oktelugu.com/

ఉరితాళ్లు పట్టుకెళ్లి బాబును ఒప్పిస్తం.. టీడీపీ నేతలు

ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని మాత్రం టీడీపీ నేతలు బలంగానే విశ్వసిస్తున్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకున్నా టీడీపీ నేతలు మాత్రం అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మరోవైపు అప్పుడే అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. పగ తీర్చుకునేందుకు విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలబోమంటూ అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జేసీ దివాకర్‌‌ రెడ్డి లాంటి నేతలైతే ఇందులో ముందు వరుసలో ఉన్నారు. Also Read: అదే […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2020 / 01:05 PM IST
    Follow us on


    ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని మాత్రం టీడీపీ నేతలు బలంగానే విశ్వసిస్తున్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకున్నా టీడీపీ నేతలు మాత్రం అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మరోవైపు అప్పుడే అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. పగ తీర్చుకునేందుకు విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలబోమంటూ అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జేసీ దివాకర్‌‌ రెడ్డి లాంటి నేతలైతే ఇందులో ముందు వరుసలో ఉన్నారు.

    Also Read: అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా..?

    ప్రత్తిపాటి పుల్లారావు కూడా చివరికి అదే అంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు ఆ మాటలే వల్లిస్తున్నారు. కానీ.. కొంత మంది నేతలు మాత్రం.. టాపిక్‌ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దూరం కాబట్టి.. అధికారం అందినా.. తమను కంట్రోల్ చేయాలనుకుంటారని వారు భావిస్తున్నారు. అందుకే.. చంద్రబాబు అలాగే ఉంటే ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఆయన మాట వినరని అంటున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదే విషయాన్ని నేరుగా చెప్పారు.

    కలెక్టర్, ఎస్పీలు కూడా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని, ఏ అధికారిని వదలమని, అందరినీ గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు పాత పద్ధతిలోనే ఉంటే ఆయన మాట ఏ ఒక్క ఎమ్మెల్యే వినే పరిస్థితి ఉండదంటున్నారు. దెబ్బకు దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మారాలి, మారకపోతే ఆయన ఒక్కరే మిగిలిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ అంటే ఏంటో చూపిస్తాం.. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని సవాల్ చేస్తున్నారు.

    Also Read: 2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా..?

    తాము ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించకపోతే.. ఉరితాళ్లు తీసుకెళ్లి ఆయన ముందు నిల్చుంటామని.. చావమంటారా అని అడగడం తప్ప.. ఇంకేమీ చేయలేమని గతంలో జేసీ కూడా మాట్లాడారు. అధికారంలో ఉండగా చంద్రబాబు ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తున్న పనుల్లో పది శాతం చేసినా వైసీపీ నేతల వ్యాపారాలన్నీ ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేవి. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం రగిలిపోతోంది. అధికారం అందిన తర్వాత తాము అంతకు మించి చేయాలన్న కసితో ఉన్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్