https://oktelugu.com/

24 గంటలకు.. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ!

గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులని.. ఓట్ల పండుగకు రారని తేలిపోయింది. అత్యధికులు ఓటింగ్ కు దూరంగా ఉండడంతో సగానికి కంటే తక్కువకు ఓటింగ్ శాతం పడిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన 24 గంటల తర్వాత మంగళవారం ఎన్నికల పోలింగ్ శాతాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. 149 డివిజన్లకు గాను 46.68 శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది. Also Read: వైరల్:నోముల నోట ఆఖరి మాటలో కమ్యూనిజం అత్యధికంగా కంచన్ బాగ్ లో 70.39 శాతం పోలింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2020 / 06:36 PM IST
    Follow us on

    గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులని.. ఓట్ల పండుగకు రారని తేలిపోయింది. అత్యధికులు ఓటింగ్ కు దూరంగా ఉండడంతో సగానికి కంటే తక్కువకు ఓటింగ్ శాతం పడిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన 24 గంటల తర్వాత మంగళవారం ఎన్నికల పోలింగ్ శాతాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. 149 డివిజన్లకు గాను 46.68 శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది.

    Also Read: వైరల్:నోముల నోట ఆఖరి మాటలో కమ్యూనిజం

    అత్యధికంగా కంచన్ బాగ్ లో 70.39 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది. అత్యల్పంగా యూసఫ్ గూడాలో 32.99 పోలింగ్ జరిగిందని వెల్లడించింది. కాగా ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో గుర్తుల తారుమారు కారణంగా గురువారం రోజు రీపోలింగ్ జరగనుంది.

    గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. మంగళవారం పోలింగ్‌తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి తెలియదంటూ ఇప్పటికే సోషల్ మీడియా నెటిజన్లు ఆటాడుకున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే… సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు

    Also Read: గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని ఆరా.. బీజేపీలో ఉత్సాహం..!

    మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని, తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్