ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో పడుతోంది. విజయతీరాలను చేరుకోలేక పోతోంది. వైసీపీ హవా ముందు బోర్లాపడుతోంది. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న వైసీపీని ఎదుర్కొనేందుకు తగిన సత్తా లేక రాజీమార్గమే రాజమార్గంగా వ్యవహరిస్తోంది. పోటీ చేయకుండానే ఓటమిని ఒప్పుకుంటోంది. దీంతో ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి గత వైభవం వస్తుందా అనే అనుమానాలు సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయ.
2017లో నిర్వహించిన కార్పొరేషన్ న్నికల్లో టీడీపీ దుమ్మురేపింది. 48 స్థానాలకు 32 సీట్లు గెలిచింది. ఇక్కడ 10 స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కార్పొరేటర్లు వైసీపీకి మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో టీడీపీ కాకినాడలో ఉన్న పరువును నిలబెట్టుకునేందుకు వైసీపీకి పదవి ఇచ్చేందుకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీడీపీ పరువు మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ ఓటమి ఖాయమని తెలిసిపోతోంది. అందుకే ఎన్నికల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసీపీ ప్రవాహంలో టీడీపీ గల్లంతు కావడం అని తేలడంతో అధినేత చంద్రబాబు పార్టీ పరువు నిలిపే పనికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. పోయిన ప్రతిష్టను తిరిగి నిలుపుకునేందుకు ఏదైనా చేయాలని చూస్తోంది.
ఏ ఎన్నికలు జరిగినా అక్కడ కొద్దిపాటి మంది కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు గెలిచినా చివరికి వారు వైసీపీలోకే దూకుతున్నారు. దీంతో ఎన్నికలంటేనే భయం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలో టీడీపీ తన విధానాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇన్నాళ్లు వైసీపీ అన్ని చోట్ల ఎదుగుతూ వస్తున్న క్రమంలో టీడీపీ తన పంథా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.