https://oktelugu.com/

Krishna Water Dispute: కృష్ణా వాటాపై కేసీఆర్ వ్యూహం ఇదే

Krishna Water Dispute: నదీ జలాల విషయంలో రెండు తెలుగు స్టేట్లలో దుమారం రేగుతోంది. తెలంగాణ (Telangana) తమకు న్యాయమైన వాటా కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సైతం అదే తీరుగా ప్రతిస్పందిస్తోంది. దీంతో రెండు ప్రాంతాల మధ్య అగాధం పెరుగుతోంది. ఇన్నాళ్లు స్నేహపూర్వకంగా ఉన్న ప్రాంతాలు వైషమ్యాల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో వచ్చే నెల ఒకటిన జరిగే కృస్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశానికి హాజరు […]

Written By: , Updated On : August 26, 2021 / 10:15 AM IST
Follow us on

CM KCR on Krishna WaterKrishna Water Dispute: నదీ జలాల విషయంలో రెండు తెలుగు స్టేట్లలో దుమారం రేగుతోంది. తెలంగాణ (Telangana) తమకు న్యాయమైన వాటా కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సైతం అదే తీరుగా ప్రతిస్పందిస్తోంది. దీంతో రెండు ప్రాంతాల మధ్య అగాధం పెరుగుతోంది. ఇన్నాళ్లు స్నేహపూర్వకంగా ఉన్న ప్రాంతాలు వైషమ్యాల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో వచ్చే నెల ఒకటిన జరిగే కృస్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులను ఆదేశించారు.

కృష్ణా జలాల్లో (Krishna Water) మనకు దక్కాల్సిన వాటా గురించి సీఎం ఇప్పటికే పలు డిమాండ్లు పెడుతున్నారు. స్టేట్ కు రావాల్సిన న్యాయమైన వాటా గురించి వాదనలు వినిపిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, ప్రత్యేకాధికారి శ్రీధర్ దేశ్ పాండే. మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రజేష్ కుమార్, ట్రైబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, అంతర్ రాష్ర్ట విభాగం చీఫ్ ఇంజినీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ అంజినీర్ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా కోసం కృష్ణా బోర్డుతో పాటు ట్రైబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని భావిస్తోంది. 1న జరిగే సమావేశానికి సాధికారిక సమాచారంతో హాజరై సమగ్రంగా మాట్లాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా జలాల వినియోగంలో స్టేట్ కు దక్కాల్సిన వాటా గురించి ఎన్ని రకాలుగా నైనా పరిష్కరించుకునేందుకు మార్గాలు వెతకాలని సూచిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా కార్టూనిస్టు మృత్యుంజయ వేసిన కార్టూన్ల సంకలనం ఉద్యమగీతను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి, సాంస్కృతిక సంచాలకుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.