https://oktelugu.com/

థర్డ్ వేవ్ కల్లోలమే: రోజుకు 7 లక్షల కేసులు?

కరోనా థర్డ్ వేవ్ భయాలు మళ్లీ ముసురుకుంటున్నాయి. థర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని.. చిన్నారులపై ప్రభావం పడుతుందని కొన్ని నివేదికలు హెచ్చరించాయి. తాజాగా భారత దిగ్గజ బ్యాంకు ఎస్.బీ.ఐ కూడా బాంబు పేల్చింది. ఆగస్టు నెలలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని.. సెప్టెంబరులో గరిష్టస్థాయిని చూపుతుందని ఎస్.బీ.ఐ రీసెర్చ్ పేర్కొంది. ఈ పరిశోధనలో ‘గ్లోబల్ వేవ్ కన్నా దేశంలో సగటు కేసులు గరిష్ట్ర స్తాయికి చేరుకుంటాయని.. 1.7 రెట్లు ఎక్కువగా థర్డ్ వేవ్ లో కేసులు నమోదు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2021 / 12:14 PM IST
    Follow us on

    కరోనా థర్డ్ వేవ్ భయాలు మళ్లీ ముసురుకుంటున్నాయి. థర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని.. చిన్నారులపై ప్రభావం పడుతుందని కొన్ని నివేదికలు హెచ్చరించాయి. తాజాగా భారత దిగ్గజ బ్యాంకు ఎస్.బీ.ఐ కూడా బాంబు పేల్చింది. ఆగస్టు నెలలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని.. సెప్టెంబరులో గరిష్టస్థాయిని చూపుతుందని ఎస్.బీ.ఐ రీసెర్చ్ పేర్కొంది. ఈ పరిశోధనలో ‘గ్లోబల్ వేవ్ కన్నా దేశంలో సగటు కేసులు గరిష్ట్ర స్తాయికి చేరుకుంటాయని.. 1.7 రెట్లు ఎక్కువగా థర్డ్ వేవ్ లో కేసులు నమోదు అవుతాయని హెచ్చరించింది.

    మొన్నటి కరోనా సెకండ్ వేవ్ కల్లోలంలో గరిష్టంగా రోజుకు 4.12 లక్షల కేసులు నమోదయ్యాయి. దానికే జనం పిట్టల్లా రాలిపోయారు. దేశంలో మరణ మృదంగం వినిపించింది. ఇప్పుడు అంతకుమించి కేసులు మూడో వేవ్ లో భారత్ లో నమోదవుతాయని.. ఏకంగా రోజుకు 7 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఎస్.బీ.ఐ పరిశోధనలో బాంబు పేల్చింది. మే 7న సెకండ్ వేవ్ దేశంలో అత్యధిక కేసులు నమోదు చేసిందని.. ఇప్పుడు డేటా ప్రకారం ఆగస్టులో థర్డ్ వేవ్ మొదలవుతుందని ఎస్.బీ.ఐ పేర్కొంది.

    ప్రస్తుతం డేటా ప్రకారం.. జులై 2వ వారంలో భారత్ లో 10వేల కేసులకు చేరుతుంది. ఆగస్టు 2వ వారం నాటికి కేసులు పతాక స్తాయికి చేరుకుంటాయని ఎస్.బీఐ నివేదిక తెలిపింది.

    అయితే కొంతమంది మాత్రం.. దేశంలో వేస్తున్న టీకా ప్రభావంతో థర్డ్ వేవ్ తీవ్రత తగ్గుతుందని.. వైరస్ పరివర్తనం చెంది కొత్త ప్రాణాంతక వైవిధ్యంగా మారితే తప్ప మూడో వేవ్ అంత పెద్దది కాదని చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా భారత్ జనాభాలో కేవలం 4.8శాతం మందికి మాత్రమే రెండు టీకాలు వేసుకున్నారు. 21.6శాతం మంది జనాభా ఒక డోసు తీసుకున్నారు. మరి థర్డ్ వేవ్ దేశంలో అలుముకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.