Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికినంత దోచుకెళ్తున్నారు. సగటున రోజుకు 41 చోరీలు, దోపిడీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2020తో పోలిస్తే 2021 లో దోపిడీలు పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులకు సవాలుగా మారుతోంది. దొంగలు వినూత్న పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎవరికి దొరకకుండా దొంగతనాలు చేస్తున్నారు.

విశాఖపట్నం సిటీ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, చిత్తూరు, విజయనగరం జిల్లాల పరిధిలో రూ. 56.91 కోట్ల విలువైన డబ్బు పోయింది. రోజుకు సగటున రూ.15.59 లక్షలు అపహరణకు గురైంది. దీంతో దొంగతనాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థమవుతోంది. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నా దోపిడీలు మాత్రం సులువుగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
Also Read: థియేటర్లపై ఓటీటీ ప్రభావం ఎంత..? ఏదీ బెటర్..? ప్రేక్షకులు దేనిని కోరుకుంటున్నారు..?
విశాఖ నగరంలో దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. 2020లో జరిగిన దొంగతనాల కంటే 2021లో రెట్టింపయ్యాయి. 2020లో రూ.1.34 కోట్లు గల్లంతు కాగా 2021లో రూ. 2.07 కోట్లు మాయమైనట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేయడంలో చోరులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నట్లు విచారణలో తెలుస్తోంది. దీంతో సొమ్ము ఇంట్లో దాచుకోవడానికి జనం భయపడుతున్నారు.
రాష్ర్టంలోని ప్రధాన నగరాల్లో ఇలా దోపిడీలో చోచుచేసుకోవడంతో ఆభరణాలు, నగదు ఎక్కడ దాచుకోవాలో ప్రజలకు అర్థం కావడం లేదు. పలు జిల్లాల్లో చోరీల సంఖ్య పెరుగుతూనే ఉంది. దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. దొరకకుండా చోరీలు చేస్తూ నిరంతరం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రుణ లక్ష్యం భారీగా పెంచుతూ?