Homeఆంధ్రప్రదేశ్‌Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చేశారు.. జగన్ పాలనలో అంతే

Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చేశారు.. జగన్ పాలనలో అంతే

Tummalapalli Kalakshetram
Tummalapalli Kalakshetram

Tummalapalli Kalakshetram: వైసీపీ ప్రభుత్వానికి ఒక హాబీ ఉంది. ప్రభుత్వ, సామాజిక భవనాలకు, కట్టడాలకు పేరు మార్చడం అంటే జగన్ సర్కారుకు చాలా ఇష్టం. అందునా తమకు నచ్చని సామాజికవర్గాల నేతల పేర్లు ఉంటే.. వాటిని చెరిపేయ్యడమో.. లేక వాటి ఆక్షరాలను కుదించి.. పక్కనే చాంతాడంత అక్షరాలను చేర్చడమో చేస్తుంటుంది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు రంగులు మార్చడం గురించి చెప్పనక్కర్లేదు. కొత్త, పాత అన్నదానితో పనిలేదు. చివరకు రక్షిత మంచినీటి పథకాలను విడిచిపెట్టలేదు. తాజాగా జగన్ సర్కారుకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చే పనిలో పడింది. ప్రస్తుతం తుమ్మపల్లి, క్షేత్రయ్య పేర్లను తీసేసి కళాక్షేత్రం వరకూ మాత్రమే కనబడేలా చేసింది. కొద్దిగా టైమ్ తీసుకొని పేరు మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Also Read: Mahasena Rajesh- TDP: చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చేశారు..ఏమిటీ ఉపద్రవం..

హైదరాబాద్ లో రవీంద్రభారతి ఎలాగో.. విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం అలానే. కళలు, కళాప్రదర్శనలకు పుట్టినిల్లుగా నిలుస్తోంది. విభజన తరువాత ఏపీ కళాకారులకు సరైన కేంద్రంగా ఉంది. వేలాది ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. అటువంటి కళాక్షేత్రంపై వైసీపీ సర్కారు కన్నుపడింది. తుమ్మలపల్లి, క్షేత్రయ్య తమ సామాజికవర్గం వారు కాదనో.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ.. పేరు మార్పునకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకేసారి ఆ మహనీయుల పేరు మార్చితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో వెనక్కి తగ్గారు. తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు కనబడకుండా చేశారు. కొద్దిరోజుల తరువాత, రాజయ్య, రాజారెడ్డో, జగనన్న అనే పేర్లు జత చేర్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కరెక్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వివాదం నడిచినప్పుడు ఇటువంటి వాటికి ప్రణాళిక రూపొందిస్తుంటారు.

Tummalapalli Kalakshetram
Tummalapalli Kalakshetram

అసలు తుమ్మలపల్లి, క్షేత్రయ్య అనే పేర్లతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ? అనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారంటే ఆయన రాజకీయ వారసులు ఉన్నారు. ఆయన స్థాపించిన పార్టీ మనుగడలో ఉంది. అందుకే ఇబ్బందిపెట్టారు అని అనుకోవచ్చు. కానీ కళాక్షేత్రం ఉన్న స్థలం తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు అనే పెద్దాయన్న దానం చేశారు. ఆయన దానకర్ణుడిగా పేరు పొందారు. స్థలం ఇచ్చిన వారి పేరు పెట్టడం సహజం అందుకే ఆయన పేరు పెట్టారు. తర్వాత మహాకవి, వాగ్గేయకారుడి పేరుతో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం అని పేరు పెట్టారు. కానీ వీరిద్దరు వారసులెవరు రాజకీయాల్లో లేరు.ఇలాంటి పేర్లుపై ఎవరికీ అభ్యంతరాల్లేవు. ఉండవు కూడా గత ప్రభుత్వం ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం పేరు మార్చేసింది. వినాసకాలే విపరీత బుద్ధి అన్నట్టు వైసీపీ సర్కారు తన గోతిని తానే తవ్వుకుంటుందన్న మాట.

Also Read: Nani Dasara Movie: కెజిఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో దసరాకు పోలికా… వివరణ ఇచ్చిన హీరో నాని!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular