TRS vs BJP : తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను హడలెత్తిస్తోంది.. అదే సమయంలో తర్వాతి గురి ఎవరిపై అన్న అంశం చాలామందికి నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీనే కేంద్ర దర్యాప్తు సంస్థల తర్వాత టార్గెట్ అని పొలిటికల్ సర్కిళ్లలో ఊహాగానాలు వస్తున్నాయి. వాటిని బలపరుస్తూ ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా తననే ఈడీ, ఐటీ టార్గెట్చేస్తాయని సన్నిహితుల వద్ద చెప్పుకోవడం గమనార్హం. పైగా దీనిని ముందే ఊహించానని.. దాడులకు బెదిరేది లేదంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాగా, బడా వ్యాపారాలు ఉన్న రాజకీయవేత్తలకు మాత్రం టెన్షన్ పట్టుకున్నది. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఈడీ, ఐటీ చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఇక రాజధాని నేతలే కాకుండా జిల్లాల్లోని నేతలు దాడుల నేపథ్యంలో అన్నీ సర్దేసుకుంటున్నారు. విలువైన డాక్యుమెంట్లు బంధువుల వద్ద కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు..
మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు అధికార టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులు, డైరెక్టర్ల ఇళ్లపై సోదాలు జరుగుతుండడం ఆ నేతలకు ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే గంగుల కమలాకర్ నివాసంలో గ్రానైట్స్ వ్యవహారానికి సంబంధించి ఈడీ సోదాలు జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులు, వ్యక్తిగత సహాయకుడిని ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ విరుచుకుపడింది. తర్వాతి టార్గెట్ ఎవరనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
-టార్గెట్ నేనే..
ఈసారి ఓ ఎమ్మెల్సీ టార్గెట్ కావచ్చంటూ పొలిటికల్ సర్కిల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించానంటూ సదరు ఎమ్మెల్సీ కూడా ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నారు. అయినా, దాడులకు తాను భయపడది లేదని, దర్యాప్తు సంస్థలతో బీజేపీ భయపెట్టాలని చూస్తోందని, దాడులు ఎదర్కొనేందకు తాను మానసికంగా సిద్ధమయ్యానంటూ చెప్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ చేతిలో ఉన్న అస్త్రాలు దర్యాప్తు సంస్థలేనని, భయపెట్టడం ద్వారా లొంగదీసుకునే ఎత్తుగడల్లో భాగమే ఈ సోదాలు, టెన్షన్‌కు గురిచేయడమని సన్నిహితులకు చెప్పుకుంటున్నాడట.
-కేసీఆర్ సన్నిహితులపైనే ఫోకస్..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును ఇరుకున పెట్టడానికే బీజేపీ ఈ దాడులు చేయిస్తున్నదంటూ టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. యాక్షన్‌కు రియాక్షన్ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైనే ఐటీ, ఈడీ తొలుత ఫోకస్ పెడతాయని కొద్దిమంది గులాబీ నేతలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. తర్వాత దాడులు జరిగేఉ అవకాశం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జాబితాను రూపొందించారు. కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా దాడులు కొనసాగవచ్చన్న అభిప్రాయాన్ని గులాబీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ను మానసికంగా టెన్షన్ పెట్టడం కోసం ఐటీ, ఈడీతో కేంద్రం ఒత్తిడి తెస్తుందని గులాబీ పార్టీలో గుసగుసలువ ఇనిపిస్తున్నాయి.
-సర్దుకుంటున్న నేతలు..
హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, విద్యా సంస్థల నిర్వహిస్తున్నవారిపై ఐటీ దృష్టి పడొచ్చనే చర్చలు టీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్నాయి. ఆ తర్వాతి వరుసలో కాంట్రాక్టులు చేసే నేతలు టార్గెట్ అవుతారంటూ స్వీయ అంచనాకు వచ్చేస్తున్నారు. మరోవైపు ఎక్కడా దొరకకుండా చూసుకోవాలన్న ముందు జాగ్రత్తలతో అన్నీ సర్దుకోవడంపై ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు, సన్నిహితులు, ఉద్యోగులు.. ఇలా చిన్న లింకు దొరికినా అక్కడకు కూడా ఐటీ, ఈడీ టీమ్‌లు వెళ్తాయని, వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా తమ చేతిలో ఏమీ లేదని పలువురు టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకూ ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
-ముందే సర్దుకున్న కేటీఆర్..
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయకుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును మల్లారెడ్డిపై జరిగిన ఐటీ దాడులు అధికార పార్టీలో ఎవరికీ లేనంత టెన్షన్ పెట్టాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు మల్లారెడ్డి ఇంట్లో దాడులు జరుగుతుండగానే, కేటీఆర్ తనపై కూడా దాడులు తప్పవని భావించారని సమాచారం. దీంతో ఆయన రెండు రోజులు రాష్ట్రంలో కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్‌పై డ్రగ్స్, భూ ఆక్రమణలు, ఇసుక దందా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రానికి వచ్చే ప్రైవేటు కంపెనీలకు చకచకా అనుమతులు ఇస్తున్నారు. ఇందుకోసం మనీలాండరింగ్ ద్వారా కేటీఆర్‌కు భారీగా ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తర్వాత ఐటీ తననే టార్గెట్ చేస్తుందని భావించిన కేటీఆర్, కీలక డాక్యుమెంట్లు, పెద్దమొత్తంలో నగదుతో రెండు రోజులు దేశం దాటిపోయినట్లు తెలుస్తోంది. అన్నీ విదేశాల్లో సర్దుకుని తిరిగి వచ్చారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
-నేతలు.. ఆచితూచి
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇవి జరుగుతున్నందున రాష్ట్రస్థాయిలో సీఎంగా కేసీఆర్ చేయదగిందేమీ లేదని వారికి వారు సర్దిచెప్పుకుంటున్నారు. సీబీఐ లాంటి సంస్థలకు ఎంట్రీ లేకపోవడంతో ఇక ఐటీ, ఈడీ మాత్రమే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నివాసం ఉండే గులాబీ నేతలే కాకుండా జిల్లాల్లోని సీనియర్లలోనూ ఈ గుబులు మొదలైంది. భూముల క్రయ విక్రయాల దగ్గరా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. తాజా ఐటీ దాడుల్లో బినామీ అకౌంట్లు అంటూ ఐటీ అధికారులు కామెంట్ చేయడంతో దానికి తగినట్లుగా బిజినెస్ చేస్తున్న నేతలు పక్కా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జరగబోయేదానికి కాచుకుని కూర్చోవడం, సోదాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోవడం మినహా వాటి నుంచి తప్పించుకునే మార్గం లేదన్న భావన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఎవరి తర్వాత ఎవరి వంతు అవుతుందనే లెక్కలేసుకోవడం తప్ప.. రెయిడ్లు మాత్రం తప్పదని డిసైడ్ అయ్యారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: They are the next target in trs with it ed attacks from the centre
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com