అమరావతిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని అమరావతి రక్షణకు రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను అక్కడి రైతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు. పోలీసులు సభా ప్రాంగణానికి బాబు వెళ్లకుండా వెలగపూడి వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పోలీసులతో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్నారు.
Also Read: రైతుల ఆందోళనలపై ‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు..!
ఈ క్రమంలోనే రాజధాని రైతుల బహిరంగ సభ వద్దకు చేరుకోవడానికి చంద్రబాబు కాలినడకన పయనమయ్యారు. పోలీసులను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.
కాలినడకన వెళ్లిన చంద్రబాబు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకొని ‘జై అమరావతి’ అంటూ రాజధాని రైతులు, జేఏసీ నేతలతో కలిసి నినాదాలు చేశారు. ఈ సభకు వేల సంఖ్యలో అమరావతి రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, నేతలు హాజరయ్యారు. ఆకుపచ్చ కండువా.. ఆకుపచ్చ వస్త్రాలు ధరించి రైతులు, మహిళలు సభకు వచ్చారు. మొత్తం 30వేల మంది దాకా హాజరయ్యారని సమాచారం.
Also Read: ముందుగా పోలీసు శాఖలోనే భర్తీ
అంతకుముందు చంద్రబాబు విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. అప్పుడు కూడా పోలీసులు బాబును అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దేవతల రాజధాని అమరావతిని విధ్వంసం చేస్తున్నారని.. న్యాయం చేయాలని దుర్గమ్మను వేడుకున్నట్టు బాబు తెలిపారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్