Train Accidents: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో వెలికితీస్తున్నా కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. ఇప్పటివరకు 230 పైచిలుకు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. వందలాది మందిని ఆసుపత్రులకు పంపించాయి. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మనదేశంలో ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయి. ఆ ఘటనల్లో వందలాదిమంది కన్నుమూశారు. భారత రైల్వే చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాదాలను ఒకసారి పరిశీలిస్తే.
దారుణమైన ప్రమాదాలు
కోరమండల్ ప్రమాదం కనివిని ఎరుగని విషాదాన్ని నింపింది. దీనికంటే దారుణమైన రైలు ప్రమాదాలు దేశంలో చాలానే చోటు చేసుకున్నాయి.
1981లో బీహార్ లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునిగింది. ఈ ప్రమాదంలో 500 మంది మరణించారు.
1995లో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తం ఎక్స్ప్రెస్ కలిండ్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొన్న ఘటనలో 350 మంది చనిపోయారు.
1999లో అస్సాం లోని గైసోల్ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 2009 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించడం విశేషం.
1998లో కోల్ కతా వెళ్తున్న జమ్ముతావి ఎక్స్ప్రెస్ ఖన్నా- లుథియానా సెక్షన్ లో పట్టారు తప్పిన గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ రైలు బోగిలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది మృతిచెందారు.
2002 లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 140 మంది చనిపోయారు.
2010లో హౌరా నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటనలో 170 మంది చనిపోయారు.
2016లో ఇండోర్ నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు.
2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోవడంతో డెల్టా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి 114 మంది దుర్మరణం చెందారు.
18 రైళ్ల రద్దు
కోర మాండల్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు 18 రైళ్ళను రద్దు చేశారు. ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్ళించారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్ పూర్ లో ఉన్న చెన్నై _హౌరా(12480) రైలును జరోలి మీదుగా పంపించారు. అలాగే వాస్కోడిగామా- షాలిమార్(18048) రైలును కటక్ మీదుగా పంపించారు. సికింద్రాబాద్ _ షాలిమార్ వీక్లీ (22850) రైలును కటక్ మీదుగా నడుపుతున్నారు. హౌరా- పూరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(12837), హౌరా- బెంగళూరు బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12863), హౌరా చెన్నై మెయిల్ (12839), హౌరా- సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్(20831) రైళ్ళను రద్దు చేశారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా- వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.