Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కొత్త భామలు హవా నడుస్తోంది. మొన్నటి వరకు పూజా హెగ్డే, కృతి శెట్టిలు వరు సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీలీల కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. పెళ్లి సందD అనే మూవీ ద్వారా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధమాకా తో ఫుల్ ఫేమస్ అయింది. ఈమూవీలో ఆమె చేసిన డ్యాన్స్ కు కుర్రాళ్లే కాకుండా సినీ పెద్దలు కూడా ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు పోటీపడీ మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల కు ఉన్న అవకాశాలు మరెవరకీ లేవనే చెప్పవచ్చు. ఈ తరుణంలో శ్రీ లీలపై కొన్ని క్రిటిక్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది.
పెళ్లిసందD సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో శ్రీలీల నార్మల్ హీరోయిన్ అని అనుకున్నారు. కానీ ఈ మూవీలో ఆమె చేసిన డ్యాన్స్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక రవితేజ ‘ధమాకా’ సినిమాలో ఆమె ఓ సాంగ్ కు వేసిన స్టెప్పులు మరింత పాపులారిటీ తెచ్చింది. అయితే ఈ సమయంలో కొందరు శ్రీలీల చిన్న సినిమాలకే పరిమితం అవుతుందని, పెద్ద హీరోల పక్కన నటించే చాన్స్ రాదని అన్నారు. అగ్ర హీరోల పక్కన నటించడానికి ఇంకా కష్టపడాలి అని అన్నారు.
కానీ అనూహ్యంగా ఈ బ్యూటికీ ఏకంగా బాలకృష్ణ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్, మహేష్ బాబుతో కనిపించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో విమర్శకుల నోళ్లూ మూయించేలా ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ‘కొత్త హీరోలు.. పాత హీరోలు.. అని తేడా లేదు. అందరితో కలిసి నటించే అవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈరోజుల్లో స్టార్ హీరో పక్కన నటిస్తేనే ఫేమస్ అని అనుకోవద్దు.. ఏ హీరోతో నటించినా సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తారు. అందుకే ఇలాంటి కామెంట్లు చేయడం మానుకోండి.. ’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మహేష్ తో ‘గుంటూరు కారం’ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ తో కలిసి నటించిన సినిమా రెడీ అవుతోంది. వీటితో పాటు రామ్ పోతినేనితో మరో సినిమా చేస్తోంది. ఇండస్ట్రీ పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ శ్రీలీలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అందుకే నిత్యం ఆమెకు సంబంధించి న్యూస్, పిక్స్ వైరల్ అవుతూ ఉన్నాయి.