Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ అంటేనే మహానగరం.. ఈ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీకావు. మెట్రో రాకముందు ట్రాఫిక్ దాటాలంటే తలకు మించిన భారమే. ఇప్పటికీ చాలా చోట్ల వాహనాలు బారులు తీరి ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ప్రయాణికులను అలెర్ట్ చేస్తుంటాడు గర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్. తాజాగా అంబర్ పేట్ ఫ్లై ఓవర్ పనులు దృష్ట్యా నగరవాసులకు కీలక సూచనలు చేశారు.

అంబర్ పేట్ ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటంతో గోల్నాక నుంచి అంబర్ పేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వాహనదారులు గమనించాల్సిందిగా నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
ఉప్పల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు అంబర్ పేట శ్రీరామణ థియేటర్ సర్కిల్ నుండి అలీ కేఫ్ చౌరస్తా నుండి జిందాతిలిస్మాత్ రోడ్డును కలుపుకొని గోల్నాక వైపు రావాల్సి ఉంటుందని చాదర్ఘాట్ వైపు నుండి వచ్చే వాహనదారులు కాచిగూడ నిమ్బోలిఅడ్డ నుండి టూరిస్ట్ హోటల్ వైపు నుండి వెళ్తూ ఫీవర్ ఆస్పత్రి తిలక్ నగర్ మీదుగా చే నెంబర్ సర్కిల్ వైపు వచ్చి తిరిగి రామంతాపూర్ రోడ్డుకు కలవాల్సి ఉంటుందని జాయింట్ సి పి ఏ వి రంగనాథ్ తెలిపారు.
ఇప్పటికే రెండు సార్లు ట్రయల్ రన్ చేసి ఇబ్బందులను గుర్తించి వాటిని మెరుగు పరచామని సీపీ తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతాయని వాహనదారులు సహకరించాల్సిందిగా సిపి రంగనాథ్ తెలిపారు.