Janasena Chief Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపు ఖాయం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోయిన సారి చేసిన తప్పులు పునరావృతం చేయకూడదని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో భీమవారం, గాజువాక వంటి కాపు ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న చోట పవన్ కళ్యాణ్ పోటీచేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి తాను పోటీచేసి గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అని అనాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే పోటీచేస్తే గెలిచే స్థానాలపై శూలశోధన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు, సెంటిమెంట్ ప్రాంతాలను గుర్తించి అక్కడ పోటీచేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రధానంగా రెండు చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇక్కడే పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: కేంద్ర మంత్రి గా పవన్…? లైట్ తీసుకుంటున్న పవర్ స్టార్!
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన స్వస్థలం అయిన పాలకొల్లుతోపాటు తిరుపతిలోనూ అసెంబ్లీ బరిలో నిలిచారు. అయితే పాలకొల్లులో ఉషారాణి చేతిలో ఓడిపోయారు. అదే తిరుపతిలో గెలిచారు. దీన్ని బట్టి కాపు ఓటు బ్యాంక్ కంటే ఆదరణ ఉన్న తిరుపతిలోనే పోటీచేస్తే బెటర్ అని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఇక తిరుపతి లేదంటే అమరావతిలో పోటీచేయడం బెటర్ అని పవన్ డిసైడ్ అయ్యారట.. అమరావతిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అమరావతి ఉద్యమాన్ని టీడీపీ, జనసేన నడిపిస్తున్నాయి. పొత్తు పెట్టుకుంటే ఇక్కడ పవన్ పోటీచేస్తే వైసీపీ అస్సలు గెలవదు. సో పవన్ ఖచ్చితంగా గెలిచి సీఎం అవుతాడు. అందుకే అమరావతిలో పోటీకి కూడా పవన్ ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే తిరుపతి లేదంటే అమరావతి పరిధిలో పోటీకి రెండు స్తానాలను పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.