Chiranjeevi Re-Entry Into Politics: మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారా..?,జనసేన పార్టీ ద్వారా MLA గా పోటీ చేయబోతున్నారా?, ఈరోజు ఆయన వేసిన ట్వీట్ ని చూస్తే నిజమేనేమో అని అనిపిస్తుంది..తన ట్విట్టర్ అకౌంట్ నుండి ‘నేను రాజకీయాలకు దూరం గా ఉన్నాను..కానీ రాజకీయాలు నాకు దూరం గా లేవు’ అంటూ ఒక వాయిస్ నోట్ పెట్టాడు..ఈ వాయిస్ నోట్ తెగ వైరల్ గా మారిపోయింది..త్వరలోనే చిరంజీవి జనసేన పార్టీ లో చేరబోతున్నారని..దానికి ముందుగా హింట్ ఇవ్వడానికే ఈ వాయిస్ నోట్ విడుదల చేసాడని అంటున్నారు కొంతమంది అభిమానులు..మరి కొంతమంది అభిమానులు అయితే అది గాడ్ ఫాదర్ సినిమా డైలాగ్ అని..అక్టోబర్ 5 వ తారీకున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ కి సంబంధించి ప్రొమోషన్స్ ఈరోజు నుండి ఘనంగా ప్రారంభించడానికి సంకేతం ఇస్తూ చిరంజీవి ఆ వాయిస్ నోట్ ని విడుదల చేశాడంటూ చెప్తున్నారు..ఏది ఏమైనా చిరంజీవి పెట్టిన ఈ వాయిస్ నోట్ ట్వీట్ అటు రాజకీయ వర్గాల్లోనూ..ఇటు సినీ ఇండస్ట్రీ లోను హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే నిన్న మొన్నటి వరుకు గాడ్ ఫాదర్ కి ప్రొమోషన్స్ లేవు..హైప్ లేదు..చిరంజీవి గారికే ఓపెనింగ్ రాని పరిస్థితి వస్తుందేమో అని భయపడిన మెగాఫ్యాన్స్ లో ఒకే ఒక్క డైలాగ్ ట్వీట్ తో గాడ్ ఫాదర్ కి ఆకాశాన్ని అందుకునే రేంజ్ హైప్ ని పెంచేసాడు మెగాస్టార్..ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వేట మాములుగా ఉండదు అని మెగా అభిమానులు ధైర్యం తో ఉన్నారు..ఇక రేపటి నుండి మెగా ఫాన్స్ కి ప్రతి రోజు పండగేనట..ఇదంతా పక్కన పెడితే చిరంజీవి గారు ఇది గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్న డైలాగా?? లేదా నిజంగానే జనసేన పార్టీ లో చేరడానికి చిరంజీవి హింట్ ఇస్తున్నాడా అనేది ఇంకా అభిమానుల్లో క్లారిటీ లేదు.
Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచే స్థానాలు ఇవే..?

ఈ నెల 25 వ తారీఖున అనంతపూర్ లో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నారు..ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నాడు..ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయ ఎంట్రీ పై అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా సాగుతున్న చర్చ.
[…] Also Read: Chiranjeevi Re-Entry Into Politics: రాజకీయాల్లోకి మెగాస్టా… […]