JanaSena-TDP: సాధారణంగా పొలిటికల్ పార్టీలు ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తామని చెబుతాయి. తమ గెలుపునకు గల కారణాలు కూడా విశ్లేషిస్తాయి. సొంత పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు ఇలా ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. రాజకీయాల్లో ఇవి సహజం. కానీ ఒక పార్టీ గురించి మరో పార్టీ నేతలు చేసే విశ్లేషణే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. గ్రౌండ్ రిపోర్టును తెలియజేస్తుంది. ఇప్పుడు ఏపీలో పవన్ నేతృత్వంలోని జనసేన గురించి అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.

అయితే తొలిరోజుల్లో మాత్రం జనసేనకు చాలా లైట్ తీసుకున్నారు. అసలు ఒక పార్టీ కాదన్నట్టు పక్కనపడేశారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమితో జనసేనను మరింత చీప్ గా చూడడం ప్రారంభించారు. అయితే మొండోడు అనుకున్నది సాధిస్తాడు అన్నట్టు…ఏపీలో పవన్ మొండిగా నిలబడ్డాడు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు. వారి ఆలోచనలోమార్పు తీసుకురాగలిగాడు. అటు అధికార పక్షం.. ఇటు ప్రధాన ప్రతిపక్షానికి దీటుగా జనసేనను నిలబెట్టాడు. దీంతో అది ఒక పార్టీయేనని భావించిన వారంతా.. ఇప్పుడు జనసేనను చూసి వణికిపోతున్నారు.
అంతర్గత సమావేశాల్లో విపక్ష నాయకులు జనసేన బలంపై అంచనాలు వేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేనకు రెండెంకల స్థానాలను కట్టబెడుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా అయితే జనసేనకు దాదాపు 50 సీట్లు వరకూ వస్తాయని యధాలాపంగా అనేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిద్ధమైంది.

అందులో భాగంగా అన్ని జిల్లాల్లోరిలే దీక్షలు చేపడుతుంది. దీక్షా శిబిరం వద్ద మాట్లాడిన ఉమ వైసీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ ఖాయమంటూనే.. జనసేనకు దాదాపు 50 సీట్లు వరకూ వస్తాయని.. మిగతా సీట్లను టీడీపీ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అంటే జనసేన బలంపై టీడీపీకి ఒక క్లారిటీ ఉందన్న మాట. ఆ పార్టీ కింగ్ తో పాటు కింగ్ మేకరయ్యే అవకాశాలుపుష్కలంగా కనిపిస్తున్నాయన్న మాట. దీనిపై జనసైనికులు తెగ ఆనందపడుతున్నారు.
[…] Also Read: JanaSena-TDP: ఏపీలో జనసేన గెలవబోయే సీట్లు ఇవే.… […]