https://oktelugu.com/

Jobs in Supreme Court : సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. అర్హత, వేతనం వివరాలు ఇవీ..

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. చాలా కాలం తర్వాత ఇందులో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్‌ రిలీజ్‌ చేసింది. 107 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. వివరాలు తెలుసుకుందా..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 10, 2024 / 11:09 AM IST

    Jobs in Supreme Court

    Follow us on

    Jobs in Supreme Court : సుప్రీం కోర్టు ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చాలాకాలం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్టు మాస్టర్, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌తోపాటు పర్సనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. పోస్టులు ఎక్కువగా ఉండడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కోర్‌ మాస్టర్‌ ఉద్యోగాలు 31, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 33, పర్సనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 43 ఉన్నాయి. డిగ్రీ అర్హతతోపాటు నిమిషానికి 40 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కోర్‌ మాస్టర్‌ ఉద్యోగాలకు ఈ అర్హతలతపాటు కనీసం ఐదేళ్ల అనుభం ఉండాలి.

    మొత్తలం ఖాళీల సంఖ్య : 107
    కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌) (గ్రూప్‌–ఏ గేజిటెడ్‌) పోస్టుల సంఖ్య: 31
    సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌–బీ) పోస్టుల సంఖ్య: 33
    పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌–బీ) పోస్టుల సంఖ్య: 43

    ఇతర ముఖ్యమైన సమాచారం:
    – ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కోర్‌ మాస్టర్‌కు అయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీతోపాటు 120 డబ్ల్యూపీఎంతో ఇంగ్లిష్‌ షార్ట్‌ హ్యాండ్‌ స్పీడ్, 40 డబ్యూలపీఎంతో కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

    – సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలనికి ఏదైనా డిగ్రీతోపాటు 110 డబ్లూపీఎంతో షార్ట్‌ హ్యాండ్, 40 డబ్ల్యూపీఎంతో ఇంగ్లిష్‌ కంప్యూటర్‌ టైప్‌రైటింగ్‌ అర్హత ఉండాలి.

    – ఇక పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు 100 డబ్ల్యూపీఎంతో షార్ట్‌హ్యాండ్, 40 డబ్ల్యూపీఎంతో కంప్యూటర్‌ టైప్‌రైటింగ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

    వయో పరిమితి…
    అభ్యర్థుల వయో పరిమితి విషయానికి వస్తే.. కోర్టు మాస్టర్‌ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

    ఆఖరు తేదీ..
    ఆసక్తి, అర్హత ఉన్నవారు డిసెంబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.250 గా నిర్ధారించారు.

    ఎంపిక విధానం ఇలా..
    అభ్యర్థులకు టైప్‌ రైటింగ్‌ టెస్ట్, రాత పరీక్ష, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మూడు కేటగిరీల ఉద్యోగాలకు ఎంపికైతే వారికి నెలకు వేతనాలు ఇలా చెల్లిస్తారు. పర్సనల్‌ అసిస్టెంట్‌కు రూ.44,900, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌కు 46,600, కోర్టు మాస్టర్‌గా ఎంపికైనవారికి రూ.67,700 చెల్లిస్తారు. రాత పరీక్ష, టైప్‌రైటింగ్, కంప్యూటర్‌ టెస్ట్‌ దేశంలోని 23 ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు.