New women ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపైనే చర్చ సాగుతోంది. ఆశావహులందరు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. తమకు మంత్రి పదవి ఖాయమని జోష్ లో ఉన్నారు. దీంతో జగన్ మదిలో ఎవరున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై పలు రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

మంత్రివర్గ విస్తరణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు మహిళలు మంత్రివర్గంలో ఉన్నారు. ఆ సంఖ్య తగ్గకుండా మళ్లీ ఐదుగురికే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజని, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా,శాంతి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో వారికే పదవులు దక్కుతాయో లేదో అనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గాల సమీకరణలు కూడా ప్రాధాన్యం వహిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఎస్టీ కోటాలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. ఎస్సీ కోటాలో కూడా పలువురు తమ భవిష్యత్ పై ఆశలు పెంచుకున్నారు. తమకు మంత్రి పదవి ఖాయమని భరోసాతో ఉన్నారు.
మొత్తానికి మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఆశలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పిన సందర్భంలో అందరి దృష్టి మంత్రి వర్గ విస్తరణపైనే పడింది. మంత్రి వర్గాన్ని విస్తరించే వరకు ఏ పని చేయకుండా చూస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎలాగైనా అధినేత ప్రాపకం పొంది పదవి దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.