Ethanol Fuel: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. నోట్ల రద్దు నుంచి పౌరసత్వ చట్టాలు తెచ్చి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పుడు దేశంలో పెట్రో రహిత వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ వినియోగం దాదాపు నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఎన్నో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్డీయే ఇప్పుడు పెట్రో రహిత వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామనడం చర్చనీయాంశంగా మారింది. అయతే ఇథనాల్ పెట్రోల్ అంటే ఏమిటి..? దాని ద్వారా వాహనాలు ఎలా నడుస్తాయి..?
ప్రస్తుతం పెట్రో వాహనాలతో దేశంతో కాలుష్యం విపరీతంగా పెరిగింది. శీతాకాలంలో ఢిల్లీలాంటి ప్రాంతాల్లో అయితే బయటకు రాని పరిస్థితి. ఈ సమస్యను అధిగమించడానికి ఇథనాల్ పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఎథిల్ ఆల్కహాల్ ను ఇథనాల్ గా పిలుస్తారు. ఇది సహజసిద్ధంగా లభిస్తుంది. కిరోసిన్, గాసోలిన్ వంటివాటిలో కన్నా ఇథనాల్ లో ఆక్టేన్ పరిమాణం చాలా తక్కువ. దీంతో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కన్నా ఇథనాల్ మెరుగ్గా పనిచేస్తుంది. అయితే పెట్రోల్ లో ఇథనాల్ ను ఎంత పరిమాణంలో కలపాన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వివిధ దేశాల సమాచారం ప్రకారం.. లీటర్ పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ ను కలుపుతున్నారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో లీటర్ పెట్రోల్ లో 70 నుంచి 75 శాతం ఇథనాల్ ను వినియోగిస్తున్నారు. 2023 ఏప్రిల్ నాటికి భారత్ లో లీటర్ పెట్రోల్ లో 20 శాతం కలపాలని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ ఇప్పటికే ప్రకటించింది.
Also Read: Conocarpus Plant: సండే స్పెషల్: భారత్-పాకిస్తాన్ లను భయపెడుతున్న ఆ మొక్క కథేంటి?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడడంతో వాతావరణం కాలుష్యమైపోతుంది. దీంతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వాడడంతో ఈ రెండు ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలనుకున్నారు. కానీ వీటిని వినియోగించాలంటే ప్రత్యేకంగా వాహనాలు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న వాహనాల్లోనే పెట్రోల్ లో ఇథనాల్ కలిపడంతో పాటు వాహనాల్లోని ఇంజన్లలో స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా పెట్రోల్ లో ఇథనాల్ కలిపితే లీటర్ పెట్రోల్ రూ.61 కే పొందవచ్చు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ లో 110కి పైగానే ఉంది. కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటున్నాయి. కానీ రాను రాను వినియోగం పెరిగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే పెట్రోల్ ధరల పెరుగుదలపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ సమయంలో ఈ సమస్య నుంచి బయటపడేందుకు కేంద్ర ఈ పథకానికి శ్రీకారం చుట్టనుంది. అయితే ఇథనాల్ ఉత్పత్తి కోసం ఇప్పటికే ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. వాటి నిర్వహణపై అనుమానాలున్నాయని కొందరు అంటున్నారు.
గత ఎనిమిదేళ్లలో ఎన్డీయే అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. నోట్ల రద్దు నుంచి వ్యవసాయ చట్టాలు, పౌరసత్వంపై ముందుకు వెళ్లింది. కానీ వ్యవసాయ చట్టాల విషయంలో వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేసింది. అయితే ఇప్పుడు ఇథనాల్ విషయంలో కేంద్రం చెప్పినట్లే సక్సెస్ అవుతుందా..? లేక ప్రకటనలకే పరమితమా..? అని కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంపై పెట్రోల్ ధరలు విపరీత ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనిని తగ్గించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read:Venkaiah Naidu: వెంకయ్య నాయుడు ‘ఉపరాష్ట్రపతి’ పదవికి దూరం కావడం వెనుక షాకింగ్ కారణం